Abhishek Nair : యూట్యూబ్ షోలతో స్టార్లు అయినవాళ్లు.. వివాదాల్లో చిక్కుక్కున్నవాళ్లు చాలామందే. తాజాగా ఈ జాబితాలో ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nair) చేరాడు. తాజాగా యూట్యూబర్ రణ్వీర్ అల్లహబడియా (Ranveer Allahbadia)తో పిచ్చాపాటి మాట్లాడిన కేకేఆర్ కోచ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘మ్యాచ్‌లకు ముందు క్రికెటర్లు శృంగారంలో పాల్గొనడం అనేది చాలా సహజమ’ని అభిషేక్ అన్నాడు. దాంతో, అతడి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోల్‌కతా మూడో టైటిల్ విజయంలో కీలక పోషించిన నాయర్ యూట్యూబ్ పొడ్‌కాస్ట్‌లో.. రణ్వీర్ ప్రశ్నలకు సూటిగా సమాధానమిచ్చాడు. ఈ క్రమంలోనే రణ్వీర్ ‘క్రికెట్లో శృంగారం?’ అనే ప్రశ్న అడిగాడు. అందుకు.. నాయర్ ‘నువ్వు పాజిటివ్ కోణంలోనే అడిగావా?’ అని అన్నాడు.
‘ప్రతి క్రికెటర్ బుర్రలో పోరాటం, సంఘర్షణ అనేవి నిరంతర జరుగుతుంటాయి. అందుకని కొందరు మ్యాచ్‌లకు ముందు సంభోగంలో పాల్గొని కాస్త రిలీఫ్ అవుతారు. అయితే మరికొందరేమో దాన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే.. శృంగారంలో పాల్గొనడం అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయమని, ప్రతి ఒక్కరు సంభోగించాలనే నియమం అంటూ క్రికెట్లో లేద’ని అభిషేక్ బదులిచ్చాడు.
లెఫ్డ్ హ్యాండ్ బ్యాటర్ అయిన అభిషేక్ 2009లో టీమిండియా(Team India) తరఫున తొలి వన్డే ఆడాడు. ఆల్‌రౌండర్‌గా జట్టులో పాతుకుపోతాడు అనుకుంటే అనుకోకుండా అదే ఏడాది జట్టుకు దూరమయ్యాడు. సెప్టెంబర్‌లో నాయర్ బ్లూ జెర్సీ వేసుకొని ఆఖరి మ్యాచ్ ఆడాడు.
అనంతరం ఐపీఎల్(IPL)పై దృష్టి పెట్టిన అభిషేక్ 2018లో కోల్‌కతా క్యాంప్‌లో చేరాడు. అప్పటినుంచి ఫ్రాంచైజీ వేలంలో కొన్న కుర్రాళ్లకు శిక్షణ ఇచ్చాడు. అభిషేక్ సలహాలతో, సూచనలతో చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్(Rinku Singh)లు మరింత రాటుదేలారు. ఆరేండ్ల నాయర్ కష్టానికి 2024లో కోల్‌కతా ట్రోఫీ గెలవడంతో ఫలితం దక్కినట్టైంది.
2012, 2014, and 👇👇👇 pic.twitter.com/9nm5XCx5Pz
— KolkataKnightRiders (@KKRiders) May 26, 2024