Ramoji Rao | ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మరణం పట్ల మంత్రి జూపల్లి కృష్ణారావు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతుణ్ని ప్రార్థించారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
తన జీవితపర్యంతం విలువలు, నిబద్ధత, క్రమశిక్షణ, అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, నైతిక విలువలు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన మహనీయుడని అన్నారు. పత్రికా, సామాజిక రంగాల్లో చేసిన కృషిని, అందించిన సేవలను మంత్రి కొనియాడారు. తెలుగు పత్రిక, టెలివిజన్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన సృజనాత్మక రూపశిల్పి రామోజీరావు అని, ఆయన లేనీ లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు.