ఇఫో: సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్‌లో భారత జట్టు మూడో విజయాన్ని నమోదుచేసింది. గురువారం భారత్.. 3-2తో న్యూజిలాండ్‌పై ఉత్కంఠ విజయాన్ని సాధించింది. ఆఖరి క్వార్టర్ దాకా స్కోర్లు 2-2తో సమంగా ఉన్నప్పటికీ మ్యాచ్ మరికొద్దిసేపట్లో ముగుస్తుందనగా సెల్వమ్ (54వ నిమిషంలో) గోల్ కొట్టడంతో గెలుపు ఖరారైంది. అంతకుముందు అమిత్ రోహిదాస్ (4), సంజయ్ (32) తలా ఓ గోల్ చేశారు. న్యూజిలాండ్ తరఫున జార్జి బేకర్ (42, 48) రెండు గోల్స్ చేసి ఆ జట్టులో గెలుపు ఆశలు నింపాడు. ఈ టోర్నీలో భారత జట్టు.. శనివారం కెనడాతో ఆడనుంది.