లక్నో: ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో రజతం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించిన యువ షట్లర్ తన్వి శర్మ.. మరోసారి సంచలన ప్రదర్శన చేసింది. లక్నోలో జరుగుతున్న సయ్యిద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఆమె.. 13-21, 21-16, 21-19తో రెండో సీడ్, మాజీ ప్రపంచ చాంపియన్ అయిన నొజొమి ఒకుహారాకు షాకిచ్చింది.
పురుషుల సింగిల్స్‌లో 19 ఏండ్ల మన్రాజ్ సింగ్.. 21-15, 21-18తో టాప్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్‌ను చిత్తుచేసి క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. వీరితో పాటు టాప్ సీడ్ ఉన్నతి హుడా.. 21-15, 21-10తో తన్సిమ్ మిర్‌పై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో.. కిడాంబి శ్రీకాంత్, ప్రియాన్షు రజావత్ ముందంజ వేయగా సీనియర్ షట్లర్ కిరణ్ జార్జి రెండో రౌండ్‌కే ఇంటిబాట పట్టా డు. హైదరాబాదీ ఆటగాడు తరుణ్ మన్నెపల్లి సైతం ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించాడు.