PM Modi | నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి (Nepal PM)గా జస్టిస్ సుశీల కర్కి (Sushila Karki) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆమె చేత దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రమాణం చేయించారు. నేపాల్ పీఎం పదవిని చేపట్టిన తొలి మహిళగా సుశీల నిలిచారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సైతం సుశీలకు శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్లోని ప్రజల శాంతి, పురోగతికి భారత్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.
రాజకీయ నేతల అవినీతి, సోషల్ మీడియాపై నిషేధం విధించడంపై జడ్ జడ్ నిరసనకారులు నేపాల్లో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. శాంతియుతంగా ప్రారంభమైన ఈ ఆందోళనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఈ ఘర్షణల్లో దాదాపు 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 1,500 మంది వరకూ గాయపడ్డారు. ప్రజాగ్రహానికి జడిసి ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. దీంతో అక్కడ ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమైంది. జన్ జడ్ ప్రతినిధుల బృందం నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ (Sushila Karki) పేరును ప్రతిపాదించారు.
దీంతో ఆమె తాత్కాలిక ప్రధానిగా శుక్రవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్ రాష్ట్రపతి భవన్లో రాత్రి 9.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కొద్ది మంది మంత్రులతో మంత్రివర్గం ఏర్పాటుచేసిన కర్కి.. వెంటనే వారితో క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. 2026 మార్చి 4న ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. దేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించాలని కూడా కర్కి ప్రతిపాదించినట్టు సమాచారం. క్యాబినెట్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత, దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అమల్లోకి రానున్నది.
Also Read..
Nepal Prime Minister | బెనారస్ హిందూ యూనివర్సిటీలో మాస్టర్స్.. భర్త విమానం హైజాకింగ్ సూత్రధారి..!
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి.. ఎమర్జెన్సీ విధించే యోచన
Nepal | నేపాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. మొదటి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించిన సుశీల