Road Blockade Case | రోడ్డు దిగ్బంధించారని.. కేంద్ర మాజీ మంత్రి సహా 14 మందికి రెండేండ్ల జైలు శిక్ష
విద్యుత్ కోతలను నిరసిస్తూ రోడ్డు దిగ్బంధించి (Road Blockade Case) భారీ ట్రాఫిక్ జామ్‌కు కారణమయ్యారని కేంద్ర మాజీ మంత్రికి యూపీ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ఆయనతోపాటు మరో 13 మందికి కూడా శిక్ష విధించింది.
ఝాన్సి: విద్యుత్ కోతలను నిరసిస్తూ రోడ్డు దిగ్బంధించి (Road Blockade Case) భారీ ట్రాఫిక్ జామ్‌కు కారణమయ్యారని కేంద్ర మాజీ మంత్రికి యూపీ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ఆయనతోపాటు మరో 13 మందికి కూడా శిక్ష విధించింది. దాదాపు 12 ఏండ్ల నాటి కేసులో వీరందరికి ఇప్పుడు శిక్ష ఖరారు కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లో కరెంటు కోతలకు వ్యతిరేకంగా విపక్ష కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రదీప్ జైన్ ఆధిత్య పిలుపుమేరకు 2013 జూన్ 11న ఝాన్సీ-కాన్పూర్ జాతీయ రహదారిని కార్యకర్తలు దిగ్బంధించారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనతోపాటు మరో 13 మందిపై కేసు నమోదుచేశారు.
విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు అనిల్ కుమార్‌తోపాటు మిగిలిన 13 మందిని దోషులుగా తేల్చింది. వారికి రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే వారిని వ్యక్తిగత పూచీకత్తుపై వెంటనే విడుదల చేసింది. తీర్పుపై అప్పీలు చేసుకోవడానికి నెల రోజులు గడువు ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
Kaaka | ‘కాకా’ బిజినెస్‌లో మెగాస్టార్ రేంజ్.. తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్!
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

