Nepal Prime Minister : నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీల కర్కి (Sushila Karki) చరిత్ర లిఖించారు. ఏరికోరి మరీ జెన్ జెడ్ ఆమెను తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకుంది. కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli) రాజీనామా చేసిన తర్వాత తదుపరి ప్రధాని ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. అప్పుడు మాజీ జస్టిస్ అయిన సుశీల కర్కి పేరు తెరపైకి వచ్చింది. న్యాయకోవిదురాలైన ఆమె పాలన దక్షత కలిగిన నేత అవుతారని జెన్ జెడ్ భావించింది.
సుశీల కర్కితో పాటు ఇంజనీర్ కుల్మాన్ ఘిసింగ్(Kulman Ghisingh), ఖాఠ్మాండ్ మేయర్ బలేంద్ర షా(Balendra Shah)లో ఒకరిని ఎంచుకోవడంపై అభిప్రాయబేధాలు తలెత్తాయి. అయితే.. శుక్రవారం సాయంత్రం నాటికి సైన్యం, అధ్యక్షుడు, ఆందోళనకారుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మాజీ జస్టిస్ అయిన సుశీలను తాత్కాలిక ప్రధాని చేసేందుకు అందరూ ఆమోదం తెలిపారు. శీతల్ నివాస్‌లో అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ రాత్రి 9 గంటలకు ఆమె చేత పదవీ ప్రమాణం చేయించారు.
నేపాల్‌లోని ఈశాన్య ప్రాంతంలో.. భారత సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిరత్ నగర్లో సుశీల కర్కి 1952లో జన్మించారు. కుటుంబంలోని ఏడుగురు సంతానంలో తనే పెద్దవారు. సుశీల ఫ్యామిలీకి తొలి ప్రధాని బిష్వేశ్వర్ ప్రసాద్ కొయిరాలతో సత్సంబంధాలు ఉండేవి. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉన్న ఆమె మహేంద్ర మొరాంగ్ క్యాంపస్ నుంచి బీఏ డిగ్రీ చదివారు.
#WATCH | Kathmandu | Nepal’s former Chief Justice, Sushila Karki, takes oath as interim PM of Nepal
Oath administered by President Ramchandra Paudel
Video source: Nepal Television/YouTube pic.twitter.com/IvwmvQ1tXW
— ANI (@ANI) September 12, 2025
అనంతరం 1972లో భారత్‌లోని బెనారస్ హిందూ యూనివర్సిటీ(BHU)లో మాస్టర్స్ చేశారు సుశీల. అక్కడే ఆమెకు దుర్గా ప్రసాద్ సుబేది(Durga Prasad Subedi)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకు దారితీయడతో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ తాను భారత్‌లో చదివిన రోజులను మర్చిపోలేదని సుశీల వెల్లడించారు. బీహెచ్‌యూ టీచర్లు, స్నేహితులనే కాదు గంగా నది నాకింకా గుర్తున్నాయి. ఈ నదికి పక్కనే ఒక హోటల్ ఉండేది. వేసవిలో అప్పుడప్పుడు మేము ఆ హోటల్ రూఫ్‌పై నిద్రించేవాళ్లం అని నేపాల్ ప్రధాన తన మాస్టర్స్ రోజులను యాది చేసుకున్నారు.
సుశీల 2009లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. సుప్రీంకోర్టులో తాత్కాలిక జడ్జిగా నియమితులైన ఆమె ఏడాది తర్వాత శాశ్వత జడ్జిగా ప్రమోట్ అయ్యారు. 2016 జూలైలో ఆమె ప్రధాన జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే.. 2017లో అప్పటి నేపాలీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టింది. అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తున్న ఒకరిని తొలగించే విషయంలో పక్షపాతంగా వ్యవహరించారనే ఆరోపణల కారణంగా ఆమె సస్పెండ్ అయ్యారు.
#SushilaKarki‘s historic rise brings renewed attention to the 1973 plane hijacking by her husband, #DurgaPrasadSubedi, to fund a revolution.#Nepalprotest
KNOW MORE: https://t.co/8lUEajd64Q
— Nomadic Nitin (@Niitz1) September 12, 2025
దాంతో, సుశీలకు మద్దతుగా ప్రజలు నిరసనలు చేపట్టారు. ఎట్టకేలకు దిగొచ్చిన ప్రభుత్వం అభిశంసన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంది. తిరిగి చీఫ్ జస్టిస్‌గా నియమితులైన ఆమె అదే ఏడాది జూలైలో న్యాయవాద వృత్తికి వీడ్కోలు పలికారు. సుశీల భర్త దుర్గా ప్రసాద్ 1973 జూన్ 10న నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం హైజాకింగ్ కీలక సూత్రధారి. 4 మిలియన్ల నేపాలీ రూపీస్ కరెన్సీతో వెళ్లుతోంది ఆ విమానం. పైలెట్‌ను తుపాకీ చూపించి బెదిరించిన ఆయన విమానాన్ని బీహార్‌లోని పుర్నియా జిల్లాలో ల్యాండ్ చేయించారు. సో.. దుర్గా ప్రసాద్‌కు భారత్‌లో రెండేళ్ల జైలు జీవితం అనుభవించారు.