హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎల్పీసెట్-2026 నోటిఫికేషన్ను గురువారం విడుదల చేశారు. ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 20 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
రూ. 100 జరిమానాతో 21 ఏప్రిల్ నుంచి 22 ఏప్రిల్ వరకు దరఖాస్తు చేసుకోచ్చని పేర్కొన్నారు. కాగా, మే 15న పరీక్ష నిర్వహించిన తర్వాత 12 రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తారు.