రోహతక్: అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్(Kabaddi Player) షీలూ బల్హరా భార్య 23 ఏళ్ల ముస్కాన్ బల్హరా ఆత్మహత్య చేసుకున్నది. రోహతక్ జిల్లాలోని బాహూ అక్బార్పుర్ గ్రామంలో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ఘటన పట్ల దర్యాప్తు కొనసాగుతోందని రోహతక్ ఎస్పీ గౌరవ్ రాజ్‌పురోహిత్ తెలిపారు. కుటుంబసభ్యుల స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. షీలూ బల్హరను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి ప్రకటన రిలీజ్ చేయలేదు. ముస్కాన్ కుటుంబ సభ్యులు షీలూ ఇంటి ముందు ధర్నా చేశారు.
తన కూతుర్ని వేధింపులకు గురి చేసినట్లు ఆరోపించారు. ఫోరెన్సిక్ బృందం ఆ ఇంటిని తనిఖీ చేసింది. ఆధారాలను సేకరించారు. రోహతక్‌లోని పీజీఐఎంఎస్ ఆస్పత్రికి ముస్కాన్ మృతదేహాన్ని తీసుకెళ్లారు. మెహంలోని ఫర్మానా గ్రామానికి చెందిన ముస్కాన్ 2023 డిసెంబర్లో షీలూను పెళ్లి చేసుకున్నది. ఆ ఇద్దరికీ 9 నెలల కుమారుడు ఉన్నాడు. షీలూ తొలుత జూడో, రెజ్లింగ్‌లో శిక్షణ పొందాడు. ఆ తర్వాత అతను తన కెరీర్‌ను కబడ్డీపై ఫోకస్ పెట్టాడు. షీలూకు ‘హర్యానా ఆలా చీతా’గా పేరున్నది. కబడ్డీలో ప్రత్యర్థి ఆటగాళ్లను ఈజీగా పట్టేస్తాడు. భారత జట్టు తరపున విదేశాల్లోనూ అతను మ్యాచ్‌లు ఆడాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు .. ముస్కాన్ తన ఇన్‌స్టాలో ఓ పంజాబీ పాటకు చెందిన రీల్‌ను పోస్టు చేసినట్లు తెలిసింది.