Nepal : గత నాలుగైదు రోజులుగా అట్టుడికిన నేపాల్‌లో కొత్త అధ్యాయం మొదలైంది. ఆ దేశ చరిత్రలో తొలి ప్రధాన మంత్రిగా మాజీ జస్టిస్ సుశీల కర్కి (Sushila Karki) బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం తాత్కాలిక ప్రధానిగా ఎంపికైన ఆమె రాష్ట్రపతి భవన్లో ప్రమాణస్వీకారం చేశారు. రాత్రి 9:00 గంటల తర్వాత శీతల్ నివాసంలో అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ఆమెతో పదవీ ప్రమాణం చేయించారు.
తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ఎంపికైన తర్వాత ప్రెసిడెంట్ రామ్‌చంద్ర పౌడెల్ పార్లమెంట్‌ను రద్దు చేశారు. దాంతో, తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరేందుకు మార్గం సుగమం అయింది. రాష్ట్రపతి భవన్లో అధ్యక్షుడు పౌడెల్ కర్కితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కొద్దిమంది మంత్రివర్గంతో ప్రధాని క్యాబినెట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది మార్చిలో నేపాల్ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగునున్నాయి. అప్పటివరకూ సుశీల నేతృత్వంలోని ప్రభుత్వం కొనసాగనుంది.
New Prime Minister Sushila Karki has taken the oath of office and secrecy in front of President Ramchandra Paudel!
Photo: NTV News pic.twitter.com/NaFafKBAVh
— Routine of Nepal banda (@RONBupdates) September 12, 2025
దేశంలో నెలకొన్న అవినీతి పాలన, నాయకుల బంధుప్రీతికి తోడూ సోషల్ మీడియాపై నిషేధం విధించడంపై నేపాల్ యువతరం భగ్గుమంది. ప్రధాని కేపీ ఓలీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 8న శాంతియుతంగా ఆందోళనలకు దిగారు జెన్ జెడ్. అయితే.. పోలీసులు వీళ్లను అణచివేసేందుకు కాల్పులు జరపగా 19 మరణించారు. దాంతో.. ఆగ్రహించిన యువత నిరసనలను హింసాత్మకంగా మార్చాయి. నేపాల్ పార్లమెంట్, సుప్రీంకోర్టుతో పాటు అధ్యక్ష భవనాన్ని ముట్టించిన ఆందోళనకారులు వాటన్నింటికీ నిప్పు పెట్టారు. దాంతో.. సైన్యం ఆదేశాలమేరకే ప్రధాని పదవికి కేపీ ఓలీ రాజీనామా చేశారు. నేపాల్ వ్యాప్తంగా చెలరేగిన ఈ అల్లర్లలో మృతుల సంఖ్య 51కి చేరింది.
#WATCH | Kathmandu | Nepal’s former Chief Justice, Sushila Karki, takes oath as interim PM of Nepal
Oath administered by President Ramchandra Paudel
Video source: Nepal Television/YouTube pic.twitter.com/IvwmvQ1tXW
— ANI (@ANI) September 12, 2025
ప్రధాని కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli) ప్రభుత్వం గద్దెదిగిన తర్వాత తాత్కాలిక ప్రధాని పదవికి ముగ్గురు మధ్య పోటీ నెలకొంది. మాజీ జస్టిస్ సుశీల కర్కితో పాటు ఇంజనీర్ కుల్మాన్ ఘిసింగ్(Kulman Ghisingh), ఖాఠ్మాండ్ మేయర్ బలేంద్ర షా(Balendra Shah)లో ఒకరిని ఎంచుకోవడంపై అభిప్రాయబేధాలు తలెత్తాయి. అయితే.. శుక్రవారం సాయంత్రం నాటికి సైన్యం, అధ్యక్షుడు, ఆందోళనకారుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మాజీ జస్టిస్ అయిన సుశీలను తాత్కాలిక ప్రధాని చేసేందుకు అందరూ ఆమోదం తెలిపారు.