Ester | తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ఎస్తేర్ నోరోన్హా. కన్నడ సినిమాలతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ, ‘వేయి అబ్బాద్ధాలు’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన ఈ చిత్రం ఎస్తేర్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తర్వాత ‘భీమవరం బుల్లోడు’ లో నాని సరసన నటించిన ఎస్తేర్ క్రేజ్ మరింత పెరిగింది. ఇక ‘గరం’, ‘జయ జానికి నాయక’, ‘చాంగురే బంగారు రాజా’, ‘69 సంస్కార్ కాలనీ’, ‘డేవిల్ – బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ వంటి చిత్రాల్లో నటించి, గ్లామర్‌తో పాటు తన అభినయంతోను మెప్పించింది.
అయితే ఎస్తేర్ సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితం విషయంలో కూడా వార్తల్లో నిలిచింది. ప్రముఖ సింగర్ నోయెల్ సేన్‌తో ప్రేమలో పడ్డ ఎస్తేర్, 2019లో అతన్ని వివాహం చేసుకుంది. కొన్ని నెలల్లోనే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మరింత గ్లామరస్ పాత్రలు చేసి సందడి చేసింది. ముఖ్యంగా ‘రెక్కి’ సినిమాలో ఆమె శృంగార సన్నివేశాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటీవలే నటిగా కాకుండా దర్శకురాలు, నిర్మాతగానూ మారిన ఎస్తేర్ బిజీ బిజీగా ఉంది. అయితే తాజాగా తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకి షాక్ ఇచ్చింది. త్వరలో సర్ప్రైజ్ రానుందని కామెంట్ పెట్టే సరికి అందరు ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందా అంటూ ఆలోచనలు చేస్తున్నారు.
క్రైస్తవ మహిళలు వివాహ సమయంలో ధరించే వైట్ కలర్ గౌను ధరించి పడవలో వెళుతూ చేపలతో ఆడుకుంటున్న పిక్ షేర్ చేస్తూ.. జీవితంలో మరో అందమైన సంవత్సరం.. అద్భుతాలు, అవకాశాలు ఇచ్చిన దేవునికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ పుట్టిన రోజు నాడు నాపై ప్రేమ కురిపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా త్వరలో మీకు ఓ గుడ్ న్యూస్ చెబుతాను. దాని కోసం వేచి ఉండండి అని రాసుకొచ్చింది. అయితే పెళ్లి సమయంలో క్రిస్టియన్స్ ధరించే డ్రెస్ ధరించి కమింగ్ సూన్ అని ఎస్తేర్ పోస్ట్ పెట్టడంతో అందరు ఆమె రెండో పెళ్లి గురించి చెబుతుందేమోనని ఆలోచిస్తున్నారు.