హైదరాబాద్: మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతక్క (Maoist Sujathakka) అలియాస్ పోతుల కల్పన అలియాస్ మైనక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమెతోపాటు మరో ముగ్గురు మావోస్టులు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమైన మీడియా సమావేశం ఉన్నదని డీజీపీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా వారిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తున్నది.
గద్వాలకు చెందిన సుజాతక్క తన చిన్నతనంలోనే అడవుల బాట పట్టారు. 1984లో మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వర రావుని ఆమె వివాహం చేసుకున్నారు. 2011లో పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతించెందారు. జనతన సర్కార్ ఇన్చార్జిగా పనిచేసిన ఆమెపై మొత్తం 106 కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్చార్జిగా ఉన్న తెలుస్తున్నది.