మిజోరాంలో కొత్త రైల్వే లైన్ ప్రారంభం
మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన 51.38 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను శనివారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.
- నేడు జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ
- 51 కిలో మీటర్ల కోసం కొండల్లో 45 టన్నెళ్లు ఏర్పాటు
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన 51.38 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను శనివారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి 2014లో శంకుస్థాపన చేశారు. దాదాపు పదకొండేళ్ల పాటు కొనసాగిన ఈ ప్రాజెక్టు కోసం కేంద్రప్రభుత్వం రూ.8000 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. ఐజ్వాల్‌కు సమీపంలో బైరాబీ నుంచి సైరంగ్ వరకు నిర్మించిన ఈ 51.38 కిలోమీటర్ల రైల్వే లైన్ కోసం 45 కొండలను తొలిచి టన్నెళ్లు నిర్మించారు.
ఈ రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా నిర్మించిన ఒక వంతెన అత్యంత లోతు నుంచి పిల్లర్లు నిర్మించారు. ఇది కుతుబ్‌మినార్ కంటే ఎైత్తెనదిగా దక్షిణ మధ్య రైల్వే జోన్ సీపీఆర్వో ఏ శ్రీధర్ స్పష్టం చేశారు. అండర్ పాసులు, వంతెనలు కలిపి 153 నిర్మించినట్టు తెలిపారు. వాటిలో 55 మేజర్ బ్రిడ్జిలు ఉన్నాయి. 97వ నంబర్ బ్రిడ్జిని 742 మీటర్లు పొడవుతో నిర్మించారు. 144వ బ్రిడ్జికి 114 మీటర్ల ఎత్తున పిల్లర్లు నిర్మించారు. బ్రిడ్జిల నిర్మాణం 11.78 కిలోమీటర్ల మేర జరిగింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

