మాస్కో: రష్యాలోని కామ్చట్కా ద్వీపకల్పంలో ఇవాళ శక్తివంతమైన భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఆ భూకం త్రీవత 7.7గా నమోదు అయ్యింది. దీంతో అధికారులు సునామీ వార్నింగ్ జారీ చేశారు. అన్ని ఎమర్జెన్సీ సర్వీసులను హై అలర్ట్‌లో ఉంచారు. కామ్చట్టా ప్రాంతీయ రాజధాని పెట్రోపవలోస్కీ లో భూకంప తీవ్రత 6.3గా ఉన్నట్లు గవర్నర్ వ్లాదిమిర్ సోలోడోవ్ తెలిపారు.
బలమైన భూకంపం రావడంతో.. స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. కీలక ప్రదేశాలను, రెసిడెన్షియల్ బిల్డింగ్‌లను తనిఖీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి డ్యామేజ్ అయినట్లు రిపోర్టు కాలేదు. నివాసితులు జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. తీర ప్రాంతంలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సునామీ వార్నింగ్ జారీ చేశామని, ఖాలకిట్రిస్కీ బీచ్‌కు వెళ్తున్న సమయంలో అందరు జాగ్రత్తగా ఉండాలన్నారు.
జూలై 30వ తేదీన ఇదే ప్రాంతంలో సుమారు 8.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. 1952 తర్వాత వచ్చిన అత్యంత శక్తివంతమైన భూకంపం అదే. ఆ భూకంప తీవ్రతకు రెండు మీటర్ల మేర ద్వీపకల్పం కదిలింది. దీంతో పసిఫిక్ తీరంలో సునామీ వచ్చింది.