Manchu Manoj | మంచు ఫ్యామిలీ విబేధాలకి చెక్ పడ్డట్టేనా.. తల్లితో కలిసి మనోజ్ సెలబ్రేషన్స్
Manchu Manoj | కొద్ది రోజుల క్రితం మంచు ఫ్యామిలీ హీరోలు మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య రాజుకున్న వివాదం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత చర్చనీయాంశం అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోహన్ బాబు, మంచు విష్ణులు మనోజ్‌పై దారుణమైన కామెంట్స్ చేయగా, మరోవైపు మనోజ్ వారిపై కేసు కూడా పెట్టాడు.
Manchu Manoj | కొద్ది రోజుల క్రితం మంచు ఫ్యామిలీ హీరోలు మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య రాజుకున్న వివాదం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత చర్చనీయాంశం అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోహన్ బాబు, మంచు విష్ణులు మనోజ్‌పై దారుణమైన కామెంట్స్ చేయగా, మరోవైపు మనోజ్ వారిపై కేసు కూడా పెట్టాడు. కొన్ని రోజుల పాటు చెలరేగిన ఈ వివాదం ఇప్పుడు కాస్త శాంతించినట్టు అనిపిస్తుంది. కన్నప్ప సినిమా రిలీజ్ సమయంలో మనోజ్ సినిమాని చూడడమే కాక ప్రశంసలు కురిపించాడు. ఇక మనోజ్ నటించిన మిరాయ్ సినిమా మంచి విజయం సాధించాలని ట్వీట్ చేశాడు విష్ణు. ఇక తాజాగా తన తల్లితో మిరాయ్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు మనోజ్. ఇవన్నీ చూస్తుంటే మళ్లీ అంతా ఒక్కటయ్యారనే ఫీలింగ్ అభిమానులలో కలుగుతుంది.
తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రలలో రూపొందిన మిరాయ్ సెప్టెంబర్ 12న విడుదలై పెద్ద విజయం సాధించింది. అయితే మూవీ రిలీజ్‌కి ముందు తన తమ్ముడు మంచు మనోజ్ నటించిన మిరాయ్ సినిమా హిట్ కావాలని శుభాకాంక్షలు తెలిపారు అతడి అన్నయ్య మంచు విష్ణు. “మిరాయ్ చిత్రానికి ఆల్ ది బెస్ట్. ఈ టీమ్‌కు దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌లో మంచు మనోజ్‌ను ప్రత్యేకంగా ట్యాగ్ చేయనప్పటికీ, తమ్ముడు నటించిన సినిమా విడుదల సందర్భంగా విషెస్ చెప్పడం మంచు ఫ్యామిలీ అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఈ పోస్ట్‌కి మంచు మనోజ్ స్పందిస్తూ.. థాంక్యూ సో మచ్ అన్నా అంటూ రిప్లయ్ ఇచ్చాడు.
ఇక కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీకి మంచు మనోజ్ దూరంగా ఉండగా, ఇప్పుడు ఆయన నటించిన మిరాయ్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మోహన్ బాబు సతీమణి, మనోజ్ తల్లి హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. మనోజ్ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన వీడియో షేర్ చేయగా, ఇందులో మనోజ్ తన తల్లి పాదాలకి నమస్కరిస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఈ విజయం చూసి తన తల్లి చాలా ఎమోషనల్ అయిందని, అందరి కన్నా చాలా గర్వంగా ఫీలైందని మనోజ్ పేర్కొన్నాడు. తనను సపోర్ట్ చేస్తున్న అభిమానులందరికి మనోజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
My mom was the proudest 🙏🏼❤️ Thank u all for making this happen ♥️ Celebrating it with my dearest ones around me makes it even more memorable 🙌🏼
My heartfelt thanks to each and every movie lover for the immense love 🙏🏻#Mirai #BlackSword pic.twitter.com/eJYQIWr7MU
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 12, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

