యూపీలో 10% కమీషన్ రగడ!
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అవినీతి మకిలి అంటుకుంది. సాక్షాత్తూ బీజేపీ ఎమ్మెల్యేనే ఈ విషయాన్ని నిర్ధారించారు. తమ ఎమ్మెల్యేలు నెలవారీ జీతాలు డ్రా చేయడమే కాక, ఎమ్మెల్యే నిధుల నుంచి 10 శాతం కమీషన్లు కూడా పొందుతారంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ త్రివేది పేర్కొన్న వీడియో ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం కలిగించింది.
- ఎమ్మెల్యే నిధి నుంచి బీజేపీ ఎమ్మెల్యేలకు 10 శాతం కమీషన్
- సొంత పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
- యోగి సర్కారుపై విపక్షాల విమర్శలు
కాన్పూర్, సెప్టెంబర్ 12: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అవినీతి మకిలి అంటుకుంది. సాక్షాత్తూ బీజేపీ ఎమ్మెల్యేనే ఈ విషయాన్ని నిర్ధారించారు. తమ ఎమ్మెల్యేలు నెలవారీ జీతాలు డ్రా చేయడమే కాక, ఎమ్మెల్యే నిధుల నుంచి 10 శాతం కమీషన్లు కూడా పొందుతారంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ త్రివేది పేర్కొన్న వీడియో ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం కలిగించింది. బుధవారం కాన్పూర్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. బీజేపీ ఎమ్మెల్యేల అవినీతిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వీడియోలో కిద్వాయ్‌నగర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ఎమ్మెల్యేలు జీతాలతో పాటు ఎమ్మెల్యే నిధి నుంచి కమీషన్లు కూడా పొందుతూ రెండు విధాలుగా ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు.
అయితే కింది స్థాయి కార్యకర్తలకు ప్రతిఫలంగా ఏమీ లభించడం లేదు’ అని అన్నారు. కాగా, హిందువులు తమ రక్షణ కోసం కత్తులు, లాఠీలు తమ ఇళ్లలో ఉంచుకోవాలని ఆయన సూచించడం మరింత వివాదం రేకెత్తించింది. అలాగే ఆయన హిందువులను జంతువుల కన్నా అధ్వాన్నమంటూ పోల్చారు. జంతువులు తమకు ఆపద వచ్చినప్పుడు రక్షించుకోవడానికి కొమ్ములను ఉపయోగించి తిరగబడతాయని, కానీ హిందువులు స్వీయ రక్షణ కోసం ప్రయత్నించరని ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై యోగి సర్కారుపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. బీజేపీ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

