e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News తక్కువ టైంలో కొవిడ్‌ను గుర్తించే టెస్టింగ్‌ టూల్‌ సిద్ధం!

తక్కువ టైంలో కొవిడ్‌ను గుర్తించే టెస్టింగ్‌ టూల్‌ సిద్ధం!

ముంబై : పన్నెండేండ్ల క్రితం స్వైన్‌ఫ్లూ దేశాలను వణికిస్తున్న సమయంలో వచ్చిన ఆలోచనకు ఇవాళ రూపం కల్పించాడు ఐఐటీ బొంబాయికి చెందిన ఓ ప్రొఫెసర్‌. గత 11 సంవత్సరాలుగా తన కంప్యూటర్‌ డెస్క్‌టాప్‌పై ఉన్న ఫోల్డర్‌లో ఉన్న ఆ ఫైల్‌కు మోక్షం కల్పించి తక్కువ టైంలో, తక్కువ ఖర్చుతో కొవిడ్‌ వైరస్‌ను గుర్తించే టూల్‌ను కనిపెట్టాడు ఐఐటీ బొంబాయి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పాఠాలు చెప్పే మనోజ్‌ గోపాలకృష్ణన్‌. అప్పటి ఆయన ఆలోచన ఇన్నాళ్లకు ఆచరణలోకి రావడంతో ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లో సామాన్యులకు వెసులుబాటు కానున్నది.

గత ఏడాది మార్చి నెలలో కొవిడ్ వ్యాప్తి పెరుగుతుండటం చూసిన మనోజ్‌ గోపాలకృష్ణన్‌.. మరో పది మందితో కలిసి ‘టేప్‌స్ట్రీ’ అనే టెస్టింగ్‌ టూల్‌ను సిద్ధం చేశారు. ఐఐటీ బొంబాయిలో కంప్యూటర్ సైన్స్‌ విభాగంలో పనిచేస్తున్న మరో ప్రొఫెసర్‌ అజిత్‌ రజ్వాడే సహకారంతో కేవలం రెండు నెలల్లోనే ఈ టెస్టింగ్‌ టూల్‌కు ప్రాణం పోశారు. ‘టేప్‌స్ట్రీ’ అనేది ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలకు ఉపయోగించే ఒక-రౌండ్ క్వాంటిటేటివ్ పూలింగ్ అల్గోరిథం. తాము సిద్ధం చేసిన టెస్టింగ్‌ టూల్‌.. కొవిడ్‌ నమూనాలను పరీక్షించడానికి తీసుకున్న సమయాన్ని బాగా తగ్గించడమేకాకుండా పూలింగ్ కారణంగా ఖర్చును కూడా 50 నుంచి 85 శాతం వరకు తగ్గించవచ్చునని మనోజ్‌ గోపాల్‌కృష్ణన్ వెల్లడించారు. ఈ టూల్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) వాణిజ్యేతర నియంత్రణ నిమిత్తం వైద్య పరికరంగా ‘టేప్‌స్ట్రీ’ని క్లియర్ చేసింది.

- Advertisement -

ఈ పరీక్షా సాధనాన్ని బెంగళూరుకు చెందిన అల్గోరిథమిక్ బయోలాజిక్స్ ప్రారంభించింది. గత ఏడాది మార్చిలో గోపాల్‌కృష్ణన్ ‘టేప్‌స్ట్రీ’పై పనిచేయడం ప్రారంభించినప్పుడు స్టార్టప్‌ మొదలుపెట్టారు. క్యాంపస్‌లు, కార్యాలయాల్లో వినియోగించేందుకు చాలా సులువుగా ఉన్నందున గోపాలకృష్ణన్‌ బృందం చర్చలు జరుపుతున్నది.

‘టేప్‌స్ట్రీ’ ఎలా పనిచేస్తుంది..?

ఈ టెస్టింగ్ టూల్‌ పరమాణు పరీక్ష కోసం కుదించిన అల్గోరిథం వలె పనిచేస్తుంది. ఎక్కువ మంది వ్యక్తుల నుంచి నమూనాలను తీసుకుని ఆర్టీ-పీసీఆర్‌ ఉపయోగించి ఒకే రౌండ్లో పూల్ చేసి పరీక్షిస్తారు. ప్రతి నమూనా మూడు పూల్స్‌కు పంపుతారు. ఈ పరీక్ష మూడు రెట్లు ఉండటమే కాకుండా ఫలితాలు ఖచ్చితమైనవిగా నిర్ధారిస్తుంది. “ఒక పూల్‌లో పాజిటివ్‌గా వస్తే, ఏ నమూనా సానుకూలంగా ఉందో తెలియదు. కానీ, ఇతర పూల్స్‌ చూసి ఏ నమూనా పాజిటివ్‌గా ఉందో అర్థం చేసుకోవడానికి గణితశాస్త్రపరంగా దాన్ని పరిష్కరించగలను” అని 40 ఏండ్ల మనోజ్‌ గోపాలకృష్ణన్‌ చెప్పారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

కార్లలో ఎయిర్‌బ్యాగ్స్‌ తప్పనిసరి గడువు పొడగింపు

టోక్యో ఒలింపిక్స్‌ ఆడటం లేదు: సెరెనా విలియమ్స్‌

యూరప్‌కు మొదటి బ్యాచ్‌ హీరో ఈ-బైక్స్

ఊపిరితిత్తులతో డెల్టా ప్లస్‌కు సంబంధం : డాక్టర్‌ అరోరా

మామూలు పిల్లోడిని.. రాష్ట్రపతి అవుతాననుకోలేదు: రాంనాథ్‌ కోవింద్‌

వ్యాక్సిన్‌ తీసుకున్న మహిళలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌..!

లేహ్‌లో రక్షణ మంత్రి పర్యటన.. మాజీ సైనికులతో భేటీ

ప్రజా ఉద్యమంగా తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి – వెంకయ్య నాయుడు

సహాయకురాలికి ముద్దిచ్చిన మంత్రి రాజీనామా

బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement