వాషింగ్టన్ : టోక్యో ఒలింపిక్స్‌లో ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ఆడటం లేదు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో అమెరికాకు ప్రాతినిధ్యం వహించి మహిళల సింగిల్స్‌లో స్వర్ణం తన ఖాతాలో వేసుకున్న ఈ నల్ల కలువ.. ఓ చిన్న కారణంతో టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఆ కారణం ఏంటంటే.. దేశం తరఫున ఆడేందుకు వెళ్లే క్రీడాకారుల జాబితాలో తన పేరు లేదని, అందుకే టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే విషయం తాను పట్టించుకోలేదని ఆమె ఆదివారం నాడు వింబుల్డన్‌లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఒలింపిక్స్ పోకూడదనడానికి చాలా కారణాలు ఉన్నాయని, రేపు, ఎల్లుండి వెళ్తానన్న గ్యారంటీ లేదని స్పష్టం చేసింది. మరో 26 రోజుల్లో టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం అవుతుండగా బాంబు పేల్చిన సెరెనా తన అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టేసింది.
అమెరికా దేశం తరఫున ఆడుతున్న సెరెనా విలియమ్స్.. 2012 లండన్ ఒలింపిక్స్ టెన్సీస్ సింగిల్స్ ఫైనల్లో మరయా షరపోవాను ఓడించి స్వర్ణం గెలుచుకున్నది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో డబుల్స్ స్వర్ణం, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో డబుల్స్ స్వర్ణం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో అక్క వీనస్‌తో కలిసి డబుల్స్ స్వర్ణం కైవసం చేసుకున్నది. టోక్యో ఒలింపిక్స్ జాబితాలో తన పేరు లేదని, ఆ విషయం తనకు తెలియదని 39 ఏండ్ల టాప్ సీడ్ క్రీడాకారణి చెప్పారు. 8 వ వింబుల్డన్ టైటిల్ గెలుచుకునేందుకు సిద్ధమైన సెరెనా.. అలియాక్సాండ్ర సాస్నోవిచ్ 24 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన రికార్డును సమం చేయాలన్న పట్టుదలతో ఉన్నది.
యూరప్‌కు మొదటి బ్యాచ్ హీరో ఈ-బైక్స్
ఊపిరితిత్తులతో డెల్టా ప్లస్‌కు సంబంధం : డాక్టర్ అరోరా
మామూలు పిల్లోడిని.. రాష్ట్రపతి అవుతాననుకోలేదు: రాంనాథ్ కోవింద్
వ్యాక్సిన్ తీసుకున్న మహిళలో డెల్టా ప్లస్ వేరియంట్..!
లేహ్‌లో రక్షణ మంత్రి పర్యటన.. మాజీ సైనికులతో భేటీ
ప్రజా ఉద్యమంగా తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి – వెంకయ్య నాయుడు
సహాయకురాలికి ముద్దిచ్చిన మంత్రి రాజీనామా
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..