Harish Rao | కరీంనగర్లో గోల్డ్ షాపులో దొంగలు పడితే.. ఆ బంగారం చోరీ చేసిన దొంగల ఇప్పటికే దేశం విడిచి పారిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాళ్లను పట్టుకోరా అంటే చాత కాదు. పట్టపగలు కరీంనగర్ నడిబొడ్డున కిలోల కొద్దీ దొంగతనం చేసి దేశం విడిచి పారిపోతే వాళ్లను పట్టుకునే తెలివి లేదు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి రాత్రి పోయి రోడ్డుపై నిలబడితే పోకిరీలు వచ్చి ఏ రకంగా ప్రవర్తించారో.. మహిళలపై ఎలా ప్రవర్తిస్తున్నారో ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పెట్టారు. అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందో మనకర్థమవుతోంది.
నిన్న హైదరాబాద్ నడిబొడ్డున ఓ సీనియర్ పోలీస్ అధికారి డీజీపీ భార్యను హత్య చేస్తే ఇప్పటివరకు వాళ్లను పట్టుకున్న పరిస్థితి లేదు. ఇంక జాగ్రత్తగా ఉండండి అంటూ పోలీస్ కమిషనర్ హైదరాబాద్ స్టేట్మెంట్ ఇస్తడు. మేమెట్లాగో జాగ్రత్తగా ఉంటాం. దానికి నువ్వు పోలీస్ కమిషనర్ ఎందుకు..? అని ప్రశ్నించారు. ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేస్తే పట్టుకునే దిక్కు లేదు. కరీంనగర్ నడిబొడ్డున దోపిడీ దొంగలు బంగారం ఎత్తుకుపోతే పట్టుకునే దిక్కు లేదు. ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ల మీద దాడి చేస్తే కనీసం ఆపే పరిస్థితి లేదు. ఒక మహిళ అర్థరాత్రి పూట హైదరాబాద్లో నడిచే పరిస్థితి లేదు. కానీ బీఆర్ఎస్ నాయకుల మీద మాత్రం రాజకీయ వేధింపులకు కొదవ లేదన్నారు.
కేసుల కేసులు పెట్టి అక్రమ కేసులు చేసి.. అరెస్టుల మీద అరెస్టులు చేసి జైలు నుంచి బయటకు రాకుండా చేస్తున్నారు. మహిళల రక్షణ ఫెయిలవడంలో అభివృద్ధి చూపిస్తున్నరు. మీరు హైదరాబాద్ పరువు తీసేసిర్రు. ఒకప్పుడు లా అండ్ ఆర్డర్లో తెలంగాణ దేశానికి దిక్సూచి. కేంద్రప్రభుత్వం తెలంగాణను అనేక సందర్భాల్లో మెచ్చుకున్నది. మహిళా పోలీస్ కమిషనర్ మంచి ప్రయత్నమే చేయొచ్చు. కానీ పరిస్థితి ఎట్లా ఉందనడానికి అది అద్దం పడుతున్నది. పరిస్థితి తీవ్రతకు కూడా అద్దం పడుతున్నది. హైదరాబాద్లో ఎంత దారుణమైన పరిస్థితులున్నాయన్నారు.
Ravi Teja | ఫుల్ స్వింగ్లో రవితేజ ‘ఇరుముడి’.. షూటింగ్ చివరి దశకు చేరిన మాస్ మహారాజ మూవీ!