Ballot Paper | హుజురాబాద్, ఫిబ్రవరి 11 : నిత్యం వార్తల్లో రకరకాల పేర్లు చూస్తూనే ఉంటాం. అయితే అప్పుడప్పుడు కొన్ని పేర్లు మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తుంటాయి. అలాంటి పేరే ఒకటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
హుజురాబాద్ పట్టణంలోని రెండోవార్డ్ నాలుగో పోలింగ్ బూత్(కాకతీయ స్కూల్)లో ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2వ వార్డులో అరుగురు అభ్యర్థులు నామినేషన్ వేయగా.. దున్నపోతుల ఎల్లమ్మ అనే అభ్యర్థి బీజేపీ తరపుర బరిలో నిలిచింది. ఓటు వేసిన ఓ ఓటర్ బ్యాలెట్ పేపర్ ఫోటో తీసి అతని దగ్గరి వ్యక్తికి చూపించాడు. అతడు తనకు షేర్ చేసుకొని సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది.
ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ, సెల్‌ఫోన్ పోలింగ్ స్టేషన్ లోపలికి తీసుకువెళ్లొద్దన్న నిబంధనలు ఉన్నప్పటికీ సెల్‌ఫోన్ పోలింగ్ కేంద్రంలోకి ఎలా వెళ్ళిందనేది చర్చనీయాంశమైంది. ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపర్ మడిచి అధికారుల ఎదురుగా బ్యాలెట్ బాక్స్‌లో వేయాల్సి ఉండగా.. ఓటర్ తన సెల్ఫోన్లో ఫొటో కొట్టుకొని బయటికి వచ్చేంత వరకు ఎవరూ గమనించకపోవడం గమనార్హం.
అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఫోటో బయటికి వచ్చిందని, ఆది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయిందని కొందరు అనుకుంటుండగా.. ఇది కూడా సదరు పార్టీలోల్లే ప్లానులో భాగంగా ఇదంతా చేసి ఉంటారనేది మరికొంతమంది అనుకుంటున్నారు. లేకపోతే ఇదీ బయటకు రావాల్సిన అవసరం ఎవరికి ఉంటుందనే దానిపై సందేహాలు కల్గుతున్నాయి. ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఏదేమైనా దీనిపై లోతుగా దర్యాప్తు చేసి భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కొత్తగూడెంలో ప్రశాంతంగా పోలింగ్.. ఓటు వేసిన కలెక్టర్
నల్లగొండలో ఓటేసిన ట్రాన్స్జెండర్లు
Chennuru | పోలింగ్ రోజూ మంత్రి వివేక్ ప్రచారం..! ఎన్నికల సంఘం తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు