హైదరాబాద్ : నగరంలో పలు చోట్ల సోమవారం తెల్లవారు జాము నుంచి భారీ వర్షం కురుస్తున్నది. మియాపూర్, కూకట్పల్లి, ఎర్రగడ్డ, అమీర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట, వనస్థలీపురం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, యూసఫ్‌గూడ, క్రిష్ణానగర్, పంజాగుట్ట, కూకట్పల్లి, జీడిమెట్లతో పాటు పరిసర ప్రాంతాల్లో వాన కురుస్తోంది. వానలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. నైరుతి రుతుపవనాలు, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సోమవారం పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.