సైబర్ దాడులతో ఎలాంటి ముప్పు లేదు : కేంద్రం
సైబర్ దాడులతో ఎలాంటి ముప్పు లేదు : కేంద్రం |

న్యూఢిల్లీ : సైబర్ దాడులతో కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన ఈ-మెయిల్స్‌కు ఎలాంటి ప్రమాదం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) పర్యవేక్షించే ఈ-మెయిల్ వ్యవస్థ సురక్షితంగా ఉందని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఎయిర్ ఇండియా, బిగ్ బాస్కెట్, డొమినోస్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన ఈ-మెయిల్స్, పాస్వర్డ్లు హ్యాకర్ల బారినపడినట్లు వచ్చిన వార్తలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ-మెయిల్ వ్యవస్థ అత్యంత సురక్షితమైందని వెల్లడించింది.
ఇతర వెబ్సైట్లపై జరిగే సైబర్ దాడులు ప్రభుత్వ ఈ-మెయిల్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపవని చెప్పింది. ఆయా వెబ్సైట్లలో నమోదు చేసుకున్న ఈ-మెయిల్, ప్రభుత్వ ఈ-మెయిల్ అకౌంట్లు పాస్వర్డ్లు ఒకటే అయినప్పుడు మాత్రమే ప్రభావం చూపించడానికి ఆస్కారం ఉంటుందని తెలిపింది. అయితే, ఇలాంటి దాడులకు సంబంధించి అధికారులకు అవగాహన కల్పించడంతో పాటు ఎప్పటికప్పుడు పాస్వర్డ్లు మార్చుకునేలా ఈ-మెయిల్ వ్యవస్థ రూపొందించామని పేర్కొంది. ఎన్ఐసీ ఈ-మెయిల్ పాస్‌వర్డ్‌లో ఏదైనా మార్పునకు మొబైల్ ఓటీపీ అవసరమని, ఓటీపీ తప్పుగా ఉంటే పాస్వర్డ్ మార్పు సాధ్యం కాదని చెప్పింది.
దీంతో ఈ మధ్య జరిగిన సైబర్ దాడులతో ప్రభుత్వ ఈ-మెయిల్స్ వ్యవస్థకు ఎటువంటి ప్రమాదం లేదని తెలిపింది. గత నెలలో ‘ఎయిర్ ఇండియా’పై చైనా హ్యాకర్లు సైబర్‌దాడికి పాల్పడ్డ ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 45 లక్షల మంది ప్రయాణికుల వివరాలను హ్యాకర్లు తస్కరించినట్లు సమాచారం. ఇందులో పాస్‌పోర్టు వివరాలు, క్రెడిట్‌కార్డుల సమాచారం వంటివి ఉన్నాయి. అయితే, వీరిలో కేంద్ర ప్రభుత్వ అధికారుల వివరాలు కూడా ఉన్నాయనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీశాఖ వివరణ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ కార్డు.. ఇలా అప్లై చేయండి
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి
Alert : తెలంగాణకు నాలుగు రోజుల వర్ష సూచన
నేటి నుంచి పట్టాలెక్కనున్న ప్రత్యేక ట్రైన్లు
దేశ రాజధానిలో అందుబాటులోకి రష్యా టీకా
మరోవారం లాక్డౌన్ పొడగింపు.. ఎక్కడంటే?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

