Alert : తెలంగాణకు నాలుగు రోజుల వర్ష సూచన
Alert : తెలంగాణకు నాలుగు రోజుల వర్ష సూచన | తెలంగాణలో రాబోయే సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

హైదరాబాద్ : తెలంగాణలో సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే నైరుతి రుతు పవనాలు రాష్ట్రమంతా విస్తరించాయి. దీనికి తోడు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో మరింత బలపడుతుందని పేర్కొంది. అలాగే పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని చెప్పింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పియర్ స్థాయి వరకు వ్యాపించింది ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం రాష్ట్రంలో పలు చోట్ల అతి భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది.
మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంలో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలో భారీ వర్షాలు, అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇదిలా ఉండగా.. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి.
ఇవి కూడా చదవండి..
ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ కార్డు.. ఇలా అప్లై చేయండి
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

