Health protection | కొండాపూర్, డిసెంబర్ 23 : ఆరోగ్య సంరక్షణ కేవలం ఆసుపత్రి గోడలకే పరిమితం కాకూడదని, వ్యాధి భారాన్ని తగ్గించే విషయంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని స్టార్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ గోపిచంద్ మన్నం అన్నారు. మంగళవారం నానక్ రాం గూడలోని దవాఖానలో ‘ది 2025 రియాలిటీ చెక్’ పేరిట ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చికిత్స కేవలం దవాఖానలకే పరిమితమవ్వకూడదని, వ్యాధి భారాన్ని తగ్గించే ప్రయత్నంలో ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపులపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్నారు. దవాఖాన వైద్య సిబ్బంది ప్రీవెంటివ్ హెల్త్‌కేర్ ఫిలాసఫీని పునరుద్ఘాటించారు. వాతావరణంలో మార్పులు, జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు, జెనిటిక్ సమస్యలు, ఒత్తిడి, స్వయం చికిత్స విధానాలు అనారోగ్యానికి ప్రధాన కారణాలవుతున్నాయని, ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు, వైద్య పరీక్షలతో ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోగలమన్నారు.
ఆరోగ్య సమస్యలు కేవలం ఒకటి, రెండు సంవత్సరాల కాలంలో రావని, దీర్ఘకాలంగా చిన్నచిన్నగా సమస్య తయారై, ఒక్కసారిగా బయటపడతాయన్నారు. 20 ఏండ్ల వయస్సు నుంచే జాగ్రత్తలు పాటించడం ఉత్తమమన్నారు. మధుమేహ వ్యాధిగ్రస్థ కుటుంబీకులు ఉంటే పిల్లలకు 10 ఏండ్ల వయస్సు నుంచే డయాబెటిక్ పరీక్షలు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు భరత్ కుమార్, గాందే శ్రీధర్, శ్రీనివాస్‌డ్డి, శ్రీకాంత్ యెర్రం, రోహిణి కస్తూరి, సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Manchu Manoj | మహిళల వస్త్రధారణ వివాదం.. శివాజీకి మంచు మనోజ్ స్ట్రాంగ్ కౌంటర్
Dense Fog | తీవ్రమైన పొగమంచుతో పలు వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి
Anchor Anasuya | ‘మా బాడీ మా ఇష్టం’.. నటుడు శివాజీకి అనసూయ కౌంటర్