Dhandoraa | నటుడు శివాజీ తన తాజా చిత్రం ‘దండోరా’ (Dhandoraa) ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేటితరం హీరోయిన్ల గ్లామర్ ప్రదర్శనపై ఘాటు విమర్శలు చేశారు.
“స్త్రీ అందం చీరకట్టులో, ఒళ్లు కనిపించకుండా వేసుకునే బట్టల్లోనే ఉంటుంది. అలా కాకుండా అభ్యంతరకరంగా (సామాన్లు కనిపించేలా) బట్టలు వేసుకుంటే అందులో విలువేముంటుంది? అని శివాజీ అన్నారు. అంతేగాకుండా హీరోయిన్లు పొట్టి బట్టలు వేసుకున్నప్పుడు బయటకు అందరూ పొగిడినా, లోపల మాత్రం అసహ్యించుకుంటారని చెబుతూ.. కొన్ని వివాదాస్పదమైన బూతు పదాలను (దరిద్రపు ము.. వంటివి) ఉదాహరణగా వాడారు. హీరోయిన్లు సావిత్రి, సౌందర్య వంటి మహానటులను స్ఫూర్తిగా తీసుకోవాలని, గ్లామర్ అనేది ఒక హద్దులోనే ఉండాలని హితవు పలికారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే సింగర్ చిన్మయి స్పందించగా.. తాజాగా యాంకర్, నటి అనసూయ కూడా శివాజీకి గట్టి కౌంటర్‌ను ఇచ్చింది.
అనసూయ ఎక్స్ వేదికగా పోస్ట్ పెడుతూ.. ఇది మా బాడీ.. మీది కాదు. మాకు నచ్చినట్లు మేం ఉంటాం అంటూ శివాజీకి స్ట్రాంగ్ కౌంటర్‌ను ఇచ్చింది. మహిళలకు తమకు నచ్చిన దుస్తులు వేసుకునే స్వేచ్ఛ ఉందని, వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం తప్పని శివాజీ వ్యాఖ్యలను పలువురు తప్పుబడుతున్నారు.
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 23, 2025