Dense Fog | ఉత్తరాది రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దట్టంగా పొగమంచు (Dense Fog) కురుస్తోంది. ఈ పొగ మంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా పొగమంచు తీవ్రతకు విజిబిలిటీ పడిపోవడంతో లక్నో-వారణాసి హైవేపై (Lucknow-Varanasi Highway) ప్రమాదం చోటు చేసుకుంది. పలు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి (Multi Vehicle Crash). ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లోని అమేథీ (Amethi) జిల్లాలో గల జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు (Dense Fog) కురుస్తోంది. ఈ పొగమంచుకు రోడ్డుపై వెళ్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి. ఈ క్రమంలో అమేథీ-సుల్తాన్పూర్ మలుపు సమీపంలో ఓ ట్రక్కు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీ కొట్టింది. ఆ తర్వాత మరో మూడు ట్రక్కులు, ఒక కారు, బస్సు ఒకదానికొకటి ఢీ కొన్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ వివేక్ సింగ్ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. 16 మంది గాయపడ్డట్లు చెప్పారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఢీకొన్న వాహనాలను యంత్రాల సాయంతో పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో వాహనదారులకు పోలీసులు కీలక విజ్ఞప్తి చేశారు. పొగమంచు పరిస్థితుల కారణంగా విజిబిలిటీ సరిగా లేదని, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Also Read..
Bangladesh High Commission | ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత.. పోలీసులు అప్రమత్తం
Shashi Tharoor | బీహార్ అభివృద్ధి చూసి సంతోషంగా ఉంది.. నితీశ్ పాలనపై శశిథరూర్ ప్రశంసలు
Air Pollution | ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో గాలి నాణ్యత.. పొగమంచుతో విమాన, రైలు సేవలపై తీవ్ర ప్రభావం