Shashi Tharoor | కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) వ్యవహారం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే.. ప్రధాని మోదీ, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో సొంత పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ, పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటూ నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. తాజాగా థరూర్ మరోసారి వార్తల్లో నిలిచారు.
బీహార్‌లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం (NDA Government)పై శశి థరూర్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో మౌలిక (Bihars Progres) సదుపాయాలపై నితీశ్ ప్రభుత్వం ఎక్కువగా దృష్టిపెట్టిందన్నారు. ‘నేను ఇంతకు ముందు విన్న దానికంటే రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు చాలా మెరుగ్గా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రోడ్లు మెరుగుపడ్డాయి. ప్రజలు అర్ధరాత్రి కూడా వీధుల్లోకి వస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. శాంతి, భద్రతలు మెరుగుపడ్డాయి. విద్యుత్, నీటి సదుపాయాలు కూడా సరిగ్గా ఉన్నాయి’ అని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ థరూర్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో నితీశ్ కుమార్ గురించి థరూర్‌ను ప్రశ్నించగా.. ‘నన్ను ఇక్కడ రాజకీయాల్లోకి లాగొద్దు. ఇక్కడ జరిగిన అభివృద్ధి చూసి సంతోషంగా ఉంది’ అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హింస.. ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
Air Pollution | ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో గాలి నాణ్యత.. పొగమంచుతో విమాన, రైలు సేవలపై తీవ్ర ప్రభావం
Rahul Gandhi: జర్మనీలో రాహుల్ గాంధీ.. భారత ఎన్నికల ప్రక్రియపై ఆందోళన