Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హింస.. ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
Bangladesh Violence: బంగ్లాదేశ్ హింస పట్ల యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన పట్ల ఆయన రియాక్ట్ అయ్యారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఆందోళన కలిగిస్తున్న విషయం వాస్తవమే అని యూఎన్ సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు.
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న హింస(Bangladesh Violence) పట్ల యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన పట్ల ఆయన రియాక్ట్ అయ్యారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఆందోళన కలిగిస్తున్న విషయం వాస్తవమే అని యూఎన్ సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. ప్రెస్ మీట్లో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయన్న అంశంపై స్పందన కోరగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ అయినా మరే ఇతర దేశమైనా, మెజార్టీకి చెందని ప్రజలు సురక్షితంగా ఉండాలని, బంగ్లాదేశీయులందరూ సేఫ్‌గా ఉండాలని, దేశంలోని ప్రతి పౌరుడు సురక్షితంగా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని విశ్వాసంతో ఉన్నట్లు డుజారిక్ తెలిపారు.
బంగ్లాదేశ్‌లోని అనేక మీడియా సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మీడియా సంస్థలను టార్గెట్ చేయడంలో తమ జీవన హక్కు ప్రమాదంలో పడినట్లు బంగ్లా జర్నలిస్టులు ఆరోపించారు. బంగ్లా మీడియా ప్రస్తుతం దీన అవస్థలో ఉన్నదని, భావస్వేచ్ఛను హరించారని జర్నలిస్టులు పేర్కొన్నారు. ఢాకాలో ఉన్న ప్రోతమ్ ఆలో, ద డెయిలీ స్టార్ వార్తాపత్రికల ఆఫీసులకు నిప్పు పెట్టిన ఘటన నేపథ్యంలో పలువురు ఎడిటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫీసులకు నిప్పుపెట్టిన సమయంలో చాలా మంది జర్నలిస్టులు లోపలే చిక్కుకుపోయారని, పోలీసులు.. ఫైర్ సర్వీసులను రాకుండా అడ్డుకున్నారని ఎడిటర్లు ఆరోపించారు. భావస్వేచ్ఛ ఇప్పుడో సమస్య కాదు అని, అసలు బ్రతికి ఉండడమే ఇప్పుడు సమస్యగా మారినట్లు డెయిలీ స్టార్ ఎడిటర్ మహఫూజ్ ఆనమ్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

