Air Pollution | ఓవైపు చలి తీవ్రత, మరోవైపు తీవ్ర కాలుష్యంతో (Air Pollution) ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నగరంలో గాలి నాణ్యత సూచిక మరోసారి ప్రమాదకరస్థాయిలో నమోదైంది. మంగళశారం ఉదయం 8:30 గంటల సమయంలో ఏక్యూఐ (AQI) లెవెల్స్ 415గా నమోదయ్యాయి. కాలుష్యానికి తోడు నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. ఫలితంగా రోడ్డు, రైలు, విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) ప్రకారం.. ఢిల్లీలోని దాదాపు 30 ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో గాలి నాణ్యత తీవ్ర స్థాయిలో నమోదైంది. కొన్ని ఏరియాల్లో ఏక్యూఐ 450ని దాటింది. అత్యధికంగా ఆనంద్ విహార్ ప్రాంతంలో ఏక్యూఐ లెవెల్స్ 466గా నమోదయ్యాయి. ఆ తర్వాత జహన్గిర్పురిలో 447, అశోక్ విహార్‌లో 444, ద్వారకా సెక్టార్-8లో 440, ఐటీవోలో 436, ఛాందినీ చౌక్ ప్రాంతంలో 425, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వద్ద 417, అలీపూర్‌లో 408, బురారీ క్రాసింగ్ వద్ద 390, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు టెర్మినల్-3 వద్ద 379, దిల్షద్ గార్డెన్లో 336, ఐఐటీ ఢిల్లీ ప్రాంతంలో 387, లోధి రోడ్డులో 368గా గాలి నాణ్యత సూచిక నమోదైంది. గురువారం వరకూ ఢిల్లీలో గాలి నాణ్యత విషపూరితంగా ఉంటుందని, రాబోయే ఆరు రోజుల్లో చాలా పేలవమైన, తీవ్ర స్థాయిల్లో నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాలుష్యానికి తోడు నగరాన్ని దట్టమైన పొగకమ్మేసింది. దీంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. ముందు వెళ్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి. పొగ మంచు విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఇవాళ ఉదయం ఢిల్లీకి రాకపోకలు సాగించే పది విమానాలు రద్దయ్యాయి. అందులో ఆరు అరైవల్స్ కాగా, నాలుగు డిపార్చర్స్ ఉన్నాయి. మరికొన్ని విమానాలు దారి మళ్లించగా, కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం విమాన కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని తెలిపింది. అయితే, ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్ కోసం విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించింది.
పొగమంచు రైలు సేవలకు కూడా తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. విజిబిలిటీ తగ్గిపోవడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also Read..
Chhattisgarh Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో సీఎం కుమారుడికి ముట్టిన 250 కోట్లు !
BJP | రాజకీయ విరాళాల్లో 85% బీజేపీకే.. కాంగ్రెస్ కన్నా సుమారు 12 రెట్లు ఎక్కువ
TRAI | గంటకు 12 నిమిషాలు మాత్రమే యాడ్స్.. టీవీ ప్రసార సంస్థలకు ట్రాయ్ ఆదేశాలు జారీ