– సైనిక మహిళా డిగ్రీ కళాశాలలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
భూదాన్ పోచంపల్లి, మార్చి 12 : ఆట పాటలు విద్యార్థినులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించడానికి అవకాశాలు కల్పిస్తాయని ప్రముఖ కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ అన్నారు. క్షణికానందాలతో భవిష్యత్‌ను అంథకారం చేసుకోవద్దని, విజ్ఞతతో సమాజంలో ఎదగాలని, తల్లిదండ్రులకు ధైర్యంగా అండగా నిలబడాలని ఆమె సూచించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక మహిళ డిగ్రీ కళాశాల భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ ముఖిలో జరుగుతున్న కాన్ఫ్లియన్స్ కు గురువారం ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కళాశాల ఆడిటోరియంలో సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య ప్రదర్శనలు, మిస్ ఆర్ డీసీ పోటీల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డ్యాన్స్ న్యాయ నిర్ణేతగా సుచిత్ర చంద్రబోస్ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మహిళ తన జీవిత ప్రయాణంలో ధైర్యంగా, ఏకాగ్రత శక్తితో రాణించాలన్నారు.

‘చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేందుకు ఆట పాటలు దోహదం’
అదే విధంగా కళాశాలలో జరిగిన ఫ్లెక్స్ వాక్ మిస్ ఆర్ డిసి పోటీలకు సినీనటి, బుల్లితెర యాంకర్ కుమారి రష్మీ గౌతమ్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించి గెలుపొందిన విద్యార్థులను సత్కరించారు. రెండవ రోజు మధ్యాహ్న కార్యక్రమంలో భాగంగా లిట్ స్పైర్ విభాగంలో యువ కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కవి సమ్మేళనంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గడ్డం మోహన్ రావు కూడా కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థుల కవి సమ్మేళనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ పాల్గొని యువ ప్రతిభను కొనియాడారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు పేక్షకులను మంత్రముగ్ధులను గావించాయి.

‘చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేందుకు ఆట పాటలు దోహదం’
నేడు క్రీడల విభాగంలో 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్ పరుగు పందాలు, షాట్ పుట్, డిస్కస్ త్రో, లాంగ్ జంప్, కబడ్డీ, క్యారం, చెస్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ విద్యాలయాల అధికారులు జాయింట్ సెక్రటరీ పిఎస్ఆర్ శర్మ, మల్టీ జోనల్ ఆఫీసర్ శ్రీమతి రజిని, స్టేట్ ఆఫీసర్ నిర్మల, జోనల్ ఆఫీసర్ విద్యా విద్యాంజలి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే శ్రీలత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ.రమాదేవి, డిప్యూటీ సెక్రటరీ రుత్మని, జాయింట్ సెక్రటరీ పిఎస్ఆర్ శర్మ, అలాగే పోటీలో 30 డిగ్రీ గురుకుల మహిళా కళాశాల నుండి వచ్చిన క్రీడాకారులు, పీడీలు, అధ్యాపకులు పాల్గొన్నారు.

‘చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేందుకు ఆట పాటలు దోహదం’

‘చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేందుకు ఆట పాటలు దోహదం’

‘చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేందుకు ఆట పాటలు దోహదం’