Adarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం ఏకే47’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధరలు పెంపునకు అనుమతి!
Adarsha Kutumbam | విక్టరీ వెంకటేశ్, శ్రీనిధి శెట్టి జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం ఏకే47’ విడుదలకు సిద్ధమవుతోంది. యాక్షన్, కుటుంబ కథాంశంతో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. గతంలో వెంకటేశ్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలు ప్రేక్షకులను అలరించడంతో ఈ కొత్త సినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి
Adarsha Kutumbam | విక్టరీ వెంకటేశ్, శ్రీనిధి శెట్టి జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం ఏకే47’ విడుదలకు సిద్ధమవుతోంది. యాక్షన్, కుటుంబ కథాంశంతో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. గతంలో వెంకటేశ్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలు ప్రేక్షకులను అలరించడంతో ఈ కొత్త సినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ‘ఆదర్శ కుటుంబం ఏకే47’ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
చిత్ర నిర్మాత ఎస్. రాధాకృష్ణ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అక్టోబర్ 26న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.75, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 అదనంగా వసూలు చేసుకోవచ్చు. అంతేకాకుండా రోజుకు ఐదు ప్రదర్శనల వరకు పెంచిన టికెట్ ధరలను అమలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న థియేటర్లకు వర్తించనున్నాయి. టికెట్ ధరల పెంపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సినిమా లైసెన్సింగ్ అధికారులు, పోలీసు కమిషనర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ ఉత్తర్వులు విడుదల చేశారు.
సినిమా విడుదలకు ముందే టికెట్ ధరల పెంపునకు అనుమతి లభించడంతో నిర్మాతలకు కొంత ఊరట లభించినట్లయింది. మరోవైపు, ఈ చిత్రానికి ప్రీమియర్లు ఉండకపోవచ్చనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటనను బట్టి స్పష్టత రానుంది. వెంకటేశ్‌కి ఉన్న కుటుంబ ప్రేక్షకుల ఆదరణ, త్రివిక్రమ్ దర్శకత్వంపై ఉన్న అంచనాలు ఈ సినిమాకు కీలకంగా మారనున్నాయి. టికెట్ ధరల పెంపు నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి వసూళ్లు సాధిస్తుంది? ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Adarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం ఏకే47’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధరలు పెంపునకు అనుమతి!
Road accident | లారీ ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
Hyderabad | హైదరాబాద్‌లో భారీ పేలుడు శబ్దాలు.. భూకంపం వచ్చిందా? బ్లాస్టింగ్ జరిగిందా?
Cyclone Arnab | అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో బీచ్‌లను మూసేసిన అధికారులు..!
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. ‘ఆదిపురుష్’తో పోలికలు,ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ ఎక్కడంటూ కామెంట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

