ప్రభుత్వ అసమర్దత వల్లే పంటలు ఎండుతున్నాయి : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేసిన తీరును చూస్తే జాలేస్తుందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేసిన తీరును చూస్తే జాలేస్తుందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. బీఆర్ఎస్ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. నిన్న ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఏదో గొప్పగా ఘనకార్యం సాధించినట్టుగా చెప్పారు. ఈ చేతకాని అసమర్థ ప్రభుత్వం వల్ల పంటలు ఎండుతున్నాయని మండిపడ్డారు. ఉన్న నీటిని కిందికి వదిలి ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి తుమ్మిడి హాట్టి దగ్గర బరాజ్ కడతాం అని చెప్తున్నారు.
రాష్ట్రంలో కరెంట్ లేక నీళ్లు అందక రైతులు అల్లాడుతుంటే ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. రాష్ట్రంలో కరువుకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని నిన్న మాజీ హరీశ్ రావు తుమ్మిడి హట్టి విషయంలో పూర్తి వివరాలతో చెప్పారన్నారు. కానీ ప్రభుత్వంలోని మంత్రులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హరీశ్ రావు, కేటీఆర్ లను తిట్టడం తప్ప ఇంకోటి లేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాల కాలం అయింది ఇంకా మా మీద ఏడ్వడం ఎందుకని ప్రశ్నించారు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ లు ఆన్ చేస్తే ఆయా జిల్లాలకు నీళ్లు వచ్చేవి.
ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ప్రభుత్వం తీరు ఉందన్నారు. వరి విత్తనాలు అమ్మవద్దు అని సీడ్ షాప్ లకు నోటీసుల ఇస్తున్నారు. మరోపక్క విత్తనాలు కొనే రైతులకు సైతం సెల్ఫ్ డిక్లరేషన్ పేరిట నోటీస్ లు ఇస్తున్నారు. ఇది ప్రభుత్వ తీరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో రేవంత్ రెడ్డి లేడని ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది అని సోషల్ మీడియాలో జోక్ లు వస్తున్నాయన్నారు.
రాష్ట్రంలో కరువు రూపుమాపేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ను రూపకల్పన చేశారు. కానీ, తుమ్మిడి హాట్టి దగ్గర బరాజ్ కట్టి ఇస్ట్ ఆదిలాబాద్ కు నీళ్లు ఇస్తాం అని ఈ ప్రభుత్వం అంటున్నది. మరి అక్కడ నీటి లభ్యత లేదని సిడబ్యూసీ స్పష్టం చేసింది. మరి నీళ్లు ఎక్కడ నుండి వస్తాయని ప్రశ్నించారు. మీరు ప్రాజెక్ట్ కట్టండి కానీ ఆ ప్రాజెక్ట్ వల్ల ఎన్ని ఎకరాలకు నీళ్లు వస్తాయి..ఎంత ఖర్చు అవుతుంది చెప్పాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉంటే ఎందుకు చోద్యం చూస్తున్నారని నిలదీశారు. బిజెపి, కాంగ్రెస్ ఇద్దరు ఇద్దరే. బొగ్గు సరఫరా లేక విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదన్నారు.
రైతుల అంశం డైవర్ట్ చేసేందుకే తుమ్మిడి హాట్ పేరుతో డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మిడి హాట్ డీపీఆర్ ఉంటే ఈ ప్రభుత్వం బయట పెట్టాలన్నారు. కేసీఆర్ పోలాల చుట్టూ తిరిగిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రైతుల పొలాల దగ్గరకు పోయే దమ్ముందా అని ప్రశ్నించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే నిధులు ఇవ్వడం లేదు. నీళ్లు ఇవ్వడం లేదంటే రేవంత్ రెడ్డి పాలన ఎంత దుర్మార్గంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కె. కిషోర్ గౌడ్, గెల్లు శ్రీనివాస యాదవ్, కురువ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రభుత్వ అసమర్దత వల్లే పంటలు ఎండుతున్నాయి : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
NZvIND: ఇండియాతో మూడో టీ20.. న్యూజిలాడ్ ఫస్ట్ బ్యాటింగ్
Guwahati: ప్రాపర్టీపై వివాదం.. హోటల్లో అయిదుగురి కాల్చివేత
Saudi Arabia | దాడులు ఆపితే ఒక బిలియన్ డాలర్లు ఇస్తాం.. హౌతీలకు సౌదీ భారీ ఆఫర్..!
Adarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం ఏకే47’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధరలు పెంపునకు అనుమతి!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

