Bangladesh High Commission | ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం (Bangladesh High Commission In Delhi) వద్దకు విశ్వ హిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బారికేడ్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
అప్రమత్తమైన పోలీసు బలగాలు వీహెచ్పీ కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నిరసనలతో ఆ ప్రాంతంలో పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరించారు. ఇటీవల బంగ్లాదేశ్ (Bangladesh) లో నెలకొన్న ఆందోళనల సందర్భంగా ఇస్లామ్ మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో 25 ఏళ్ల దీపూ చంద్రదాస్ (Dipu Chandra Das) అనే హిందూ యువకుడిని ఆందోళనకారులు తీవ్రంగా కొట్టి చంపారు. ఈ హత్యపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.
#WATCH | Delhi | Protest by members of Vishva Hindu Parishad and other Hindu organisations continues near the Bangladesh High Commission over the atrocities against Hindus and the mob lynching of Dipu Chandra Das in Bangladesh
A protester says,” Hindus are being killed there.” pic.twitter.com/pZ8RYdPpYB
— ANI (@ANI) December 23, 2025
Also Read..
Muhammad Yunus | బంగ్లాదేశ్లో సకాలంలోనే ఎన్నికలు.. అశాంతి వేళ యూనస్ కీలక ప్రకటన
Bangladesh Violence: బంగ్లాదేశ్లో హింస.. ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
బంగ్లాలో మరో విద్యార్థి నేతపై కాల్పులు