Muhammad Yunus | ఇంఖిలాబ్ మంచ్ అధికార ప్రతినిధి ఉస్మాన్ హాదీ (Osman Hadi)పై హత్య దరిమిలా బంగ్లాదేశ్ (Bangladesh)లో మరోసారి హింస చెలరేగిన విషయం తెలిసిందే. వేల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో బంగ్లాలో అశాంతి నెలకొంది. ఈ నిరసనల వేళ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో ఎన్నికలు (Bangladesh Polls) సకాలంలో జరుగుతాయని తెలిపారు. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా దౌత్యవేత్త సెర్గియో గోర్ (Sergio Gor)కు తెలియజేశారు.
సెర్గియో గోర్‌తో యూనస్ ఫోన్లో సంభాషించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలనే తన నిబద్ధతను యూనస్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. మాజీ ప్రధాని షేక్ హసీనా పాలన గురించి ప్రస్తావిస్తూ.. నిరంకుశ పాలన సమయంలో దొంగలించిన తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని యూనస్ వ్యాఖ్యానించారు.
‘హసీనా మద్దతుదారులు ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగించేందుకు మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. దేశం విడిచి పారిపోయిన వారు హింసను ప్రేరేపిస్తున్నారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. ఎన్నికలకు 50 రోజుల సమయం ఉంది. స్వేచ్ఛగా, న్యాయంగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నాము’ అని సెర్గియోతో యూనస్ అన్నారు.
Also Read..
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హింస.. ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
బంగ్లాలో మరో విద్యార్థి నేతపై కాల్పులు