Sheikh Hasina | బంగ్లాదేశ్‌లో హింస సర్వసాధారణమైంది.. నియంత్రించే శక్తి యూనస్ ప్రభుత్వానికి లేదు : షేక్ హసీనా
Sheikh Hasina | బంగ్లాదేశ్ (Bangladesh)లో ఉద్రిక్తతలపై ఆదేశ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తాజాగా స్పందించారు. ఈ మేరకు యూనస్ (Muhammad Yunus) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Sheikh Hasina | మన పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh) మరోసారి భగ్గుమంది. ఇటీవల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థి, తిరుగుబాటు నాయకుడు, భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే షరీఫ్ ఉస్మాన్ హాది (32) మరణించడంతో ఆ దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు గురు, శుక్రవారాల్లో దేశంలో పలుచోట్ల నిరసనలు చేపట్టడంతో హింస, విధ్వంసం చోటు చేసుకుంది.
అల్లర్లలో ఒక హిందువు హత్యకు గురి కాగా, పలువురు నిరసనకారులు, పౌరులు గాయపడ్డారు. ప్రస్తుతం ఆ దేశంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఉద్రిక్తతలపై ఆదేశ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తాజాగా స్పందించారు. ఈ మేరకు యూనస్ (Muhammad Yunus) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బంగ్లాదేశ్‌లో హింస అనేది సాధారణ విషయంగా మారిందని.. దేశంలో హింసను నియంత్రించడంలో తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.
ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హసీనా మాట్లాడుతూ. ‘ఉస్మాన్ బిన్ హాదీ హత్య అనంతరం ఢాకాలో నెలకొన్న హింస దేశాన్ని మరితం అస్థిరపరుస్తోంది. ఈ హత్య నా ప్రభుత్వాన్ని కూల్చివేసి, యూనస్ పాలనలో పెరిగిపోయిన అక్రమాన్ని ప్రతిబింబిస్తోంది. నన్ను బహిష్కరించినప్పటి నుంచి దేశంలో పరిస్థితి మరింత దిగజారింది. యూనస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగ్లాలో హింస పెరిగిపోయింది. హింసను ఆపడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నిరంతర హింస బంగ్లాదేశ్‌ను అంతర్గతంగా అస్థిరపరుస్తోంది.
పొరుగు దేశాలతో, ముఖ్యంగా భారతదేశంతో సంబంధాలను దెబ్బతీస్తోంది. ఈ గందరగోళాన్ని, మైనారిటీలపై జరుగుతున్న వేధింపులను, మనం కలిసి నిర్మించిన వ్యవస్థల క్షీణతను భారత్చూస్తోంది’ అని హసీనా వ్యాఖ్యానించారు. యూనస్ ప్రభుత్వం ఇస్లామిక్ తీవ్రవాద శక్తులకు అవకాశం కల్పిస్తోందని షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. తీవ్రవాదులను కేబినెట్లో చేర్చుకోవడం, జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను విడుదల చేయడం వంటి చర్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. యూనస్‌కు పాలనా అనుభవం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read..
Air India | విమానంలో జీరోకి పడిపోయిన ఇంజిన్ ఆయిల్ ప్రెజర్.. ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్..
Gulmarg | స్కీయింగ్ సిటీపై మంచు దుప్పటి.. శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న టూరిస్ట్‌లు
Black Gram | మినుములను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

