Actor Shivaji | ‘దండోరా’ సినిమా ఈవెంట్లో టాలీవుడ్ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఇప్పటికే సింగర్ చిన్మయి, అనసూయ శివాజీని విమర్శించగా.. తాజాగా మంచు మనోజ్ కూడా శివాజీ పేరు ఎత్తకుండానే ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చారు. మహిళలను కించపరిచేలా మాట్లాడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మనోజ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఒక లెటర్ విడుదల చేశాడు.
మహిళల దుస్తుల విషయంలో నీతులు చెప్పడం, వారిపై నైతిక బాధ్యత లేదు అని ఆరోపించడం అనేది చాలా పాత కాలపు ఆలోచన. ఇలాంటి వ్యాఖ్యలు తనను తీవ్ర నిరాశను కలిగించాయని మనోజ్ పేర్కొన్నారు. అలాగే శివాజీ చేసిన వ్యాఖ్యలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21లను ఉల్లంఘించేలా ఉన్నాయని మనోజ్ గుర్తు చేశారు. సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ అనేవి చర్చించలేని అంశాలని మహిళల బట్టలపై తీర్పు ఇచ్చే అధికారం ఎవరికీ లేదని ఆయన తేల్చి చెప్పారు. మహిళలను కించపరిచేలా వస్తువులుగా చూస్తూ మాట్లాడిన ఆ సీనియర్ నటుడి తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను. అటువంటి మాటలు పురుషులందరి అభిప్రాయం కాదని అని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్ ఫిగర్స్‌గా ఉన్నవారు సమాజంపై తమ మాటల ప్రభావం ఉంటుందని గుర్తించి బాధ్యతగా మాట్లాడాలని ఆయన హితవు పలికారు. ఇలాంటి ప్రవర్తనను సాధారణీకరించడం లేదా మౌనంగా భరించడం ఇకపై కుదరదని మనోజ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. మహిళలకు ఎప్పుడూ గౌరవం, సమానత్వం దక్కాలి. ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉండటం సరైన పద్ధతి కాదు. మనోజ్ కుమార్ తన పోస్ట్‌ను ముగించాడు.
అసలేం జరిగింది?
శివాజీ ఇటీవల ఒక సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ.. హీరోయిన్లు సంప్రదాయబద్ధంగా ఉండాలని, పొట్టి బట్టలు వేసుకుంటే బయట పొగిడినా లోపల అసహ్యించుకుంటారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఆయన వాడిన కొన్ని పదాలు మహిళా లోకాన్ని ఆగ్రహానికి గురిచేశాయి. సావిత్రి, సౌందర్య వంటి వారిని చూసి నేర్చుకోవాలని ఆయన చేసిన సూచనలు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి. అయితే ఈ వ్యాఖ్యలపై మంచు మనోజ్ చేసిన కౌంటర్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Came across some deeply disappointing comments last night.
A civilised society protects women’s rights instead of policing their choices. #RespectWomen #RespectYourself pic.twitter.com/ym3CmPsxgD
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 23, 2025