GST : జూలైలో జీఎస్టీ ఆదాయం రూ.1.16లక్షల కోట్లు

న్యూఢిల్లీ : జూలై నెలలో కేంద్రానికి రూ.1.16లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది జూలైతో పోలిస్తే 33శాతం వృద్ధి నమోదైందని, ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2020 సంవత్సరం జూలైలో వస్తుసేవల పన్ను (GST) ద్వారా రూ. 87,422 కోట్లు కాగా.. ఈ ఏడాది జూన్‌లో రూ.92,849 కోట్లు వచ్చింది. జూలైలో ఆదాయం రూ.1,16,393కోట్లకు పెరిగింది. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ.22,197కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.28,541 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.57,864 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.27,900కోట్లు సహా), సెస్ ద్వారా రూ.7,790 కోట్లు (వస్తువుల దిగుమతిపై వచ్చిన రూ.815కోట్లతో సహా) వచ్చాయని ఆర్థిక శాఖ పేర్కొంది. వరుసగా ఎనిమిది నెలలు పాటు రూ.లక్ష కోట్లకుపైగా వచ్చిన జీఎస్టీ ఆదాయం గత జూన్‌లో రూ.లక్ష కోట్లకు దిగువకు పడిపోయింది. మే మాసంలో చాలా రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు, లాక్డౌన్లు అమలులో ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని, రాబోయే నెలల్లో సైతం జీఎస్టీ ఆదాయం భారీగా కొనసాగే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
నైట్ కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడ? ఎప్పటి వరకంటే?
Nagarjuna sagar Dam । నేడు సాగర్ గేట్ల ఎత్తివేత
Covid-19 : దేశంలో కొనసాగుతున్న మహమ్మారి ఉధృతి
Sputnik V : సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి : ఆర్డీఐఎఫ్
Pegasus : ‘పెగాసస్’పై ఈ నెల 5న సుప్రీంకోర్టు విచారణ!
Gas Cylinder Price : గ్యాస్ సిలిండర్‌పై రూ.73.5 పెంపు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
Mamitha Baiju | మమితా బైజు అసలు పేరు నమితనా? బర్త్ సర్టిఫికెట్లో జరిగిన పొరపాటుతో పేరు ఎలా మారిందో తెలుసా?
Plane Crash | ట్రంప్ నివాసానికి సమీపంలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. తొమ్మిది మంది మృతి
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
గ్లామర్ డోస్ పెంచేసిన హెబ్బా పటేల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ ఫొటోషూట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

