e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home News Nagarjuna sagar Dam । నేడు సాగర్‌ గేట్ల ఎత్తివేత

Nagarjuna sagar Dam । నేడు సాగర్‌ గేట్ల ఎత్తివేత

హైదరాబాద్‌ : ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. శ్రీశైలం జలాశయం నుంచి భారీగా వస్తున్న వరద నీటితో సాగర్‌ జలకళను సంతరించుకున్నది. నేటి సాయంత్రం వరకు ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయిలోకి చేరుకునే అవకాశం ఉండడంతో క్రస్ట్‌ గేట్లు ఎత్తివేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు గేట్లను ఎన్‌ఎన్‌పీ అధికారులు క్రస్ట్‌ గేట్లను పరిశీలించారు.

సాయంత్రం ఆరు గంటలకు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు సీఈ శ్రీకాంతరావు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 4,80,222 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. ప్రస్తుతం ఔట్‌ఫ్లో 37,743 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుతం 579.20 అడుగులకు చేరింది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు. ప్రస్తుతం డ్యామ్‌లో 280.69 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

ఇవి కూడా చదవండి..

కర్ణాటక వెళ్తే ఆర్టీ పీసీఆర్‌ నెగెటివ్‌ తప్పనిసరి.. ఎవరికంటే?
నైట్‌ కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడ? ఎప్పటి వరకంటే?
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana