Group-1 Aspirants | హైదరాబాద్ : గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలతో అశోక్ నగర్ అట్టుడికి పోతోంది. సీఎం డౌన్ డౌన్ నినాదాలతో మార్మోగిపోతోంది. జీవో 55 ముద్దు.. జీవో 29 వద్దు ప్లకార్డులు దర్శనమిస్తున్నాయి. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. జీవో 29 రద్దు చేశాకే గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇక అశోక్ నగర్ నుంచి సెక్రటేరియట్ వైపు వెళ్తున్న ఓ నిరుద్యోగి.. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగాడు. మా ఓట్లతో గెలిచిన రేవంత్ రెడ్డి ఎక్కడ దాక్కున్నవ్.. ఎందుకు మాట్లాడుతలేవ్.. అశోక్‌నగర్‌లో గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలు కనిపించడం లేదా..? మా ఓట్లతో గెలిచిన నీవు.. మా పట్ల ఎందుకు ఇంత కర్కశంగా ప్రవర్తిస్తున్నావ్.. గుంపు మేస్త్రీ.. నీకు బుద్ధి, సిగ్గు, శరం ఉందా..? అసలు నువ్వు మనిషివేనా..? ఓట్ల కోసం అశోక్ నగర్ వచ్చావ్ కదా..? ఈ రోజు గెలిచి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నావ్.. ఓట్లు వేయండని ప్రాధేయపడ్డ నువ్వు ఇవాళ ఎక్కడికి పోయావ్.. ఒక్క మాట మాట్లాడుతలేవ్ అంటూ ఆ యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు.
సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయిన గ్రూప్ అభ్యర్థి pic.twitter.com/fKha2CUjXG
— Telugu Scribe (@TeluguScribe) October 19, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఈ ఖరీఫ్‌కు రైతు భరోసా లేనట్టే..! కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఆగ్రహం
Harish Rao | జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం : హరీశ్‌రావు