స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 1 : కేసీఆర్‌ను అరెస్ట్ చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని మాజీ ఎమ్మెల్యే రాజయ్య హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్ అధ్యక్షతన పార్టీ శ్రేణుల తో కలిసి నల్ల జెండాలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా రాజయ్య మాట్లాడుతూ ఓటు కు నోటు కేసులో జైలు కూడు తిన్న సీఎం రేవంత్‌రెడ్డి సంక్షేమంలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపిన కేసీఆర్‌ను జైలుకు పంపించాలని కక్ష కట్టినట్లు ప్రవర్తిస్తున్నాడని అన్నా రు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు గర్వకారణమని, గోదావరి జలాలను ఎత్తిపోసి లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన చరిత్ర కేసీఆర్‌ది అన్నారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే కుట్రలు పన్ని, ప్రాజెక్ట్‌కు చెడ్డపేరు తెచ్చే ప్రయ త్నం చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను చంపి బనకచర్ల ప్రాజెక్ట్‌ను బతికించి ఆంధ్రాకు నీళ్లు తరలించి చంద్రబాబుకు గురుదక్షిణగా ఇవ్వాలని, చంద్రబాబు, మోడీల మెప్పు పొందడానికి తహతహలాడుతున్నాడని రాజయ్య పేర్కొన్నారు.
రూ.94వేల కోట్లతో ప్రాజెక్టు చేపడితే, ఇందులో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని సీఎం, రాహుల్ గాంధీ అనడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. రూ.94వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు, రూ.4వేల కోట్లతో మేడిగడ్డను నిర్మించారని అక్బరుద్దీన్ ఓవైసీ అనడం కాంగ్రె స్ ప్రభుత్వానికి సిగ్గు చేటన్నారు. కార్యక్రమం లో మాజీ జడ్పీటీసీ మారపాక రవి, అక్కనపల్లి బాలరాజు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చందర్ రెడ్డి, ఆకుల కుమార్, ఇనుగాల నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ సురేశ్, కనకం గణేశ్, గుండె మల్లేశ్, జనగాం యాదగిరి, రాజన్బా బు, ఒగ్గు రాజు, కుంభం కుమార్, గాదె రాజు, ఆకారపు అశోక్, చిట్టి బాబు పాల్గొన్నారు.