హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 1: 2025- 2026 విద్యాసంవత్సరానికి హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(స్వయంప్రతిపత్తి) ఖాళీగా ఉన్న వాణిజ్య శాస్త్రం సబ్జెక్టులో అతిథి అధ్యాపక నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గర్రపు శ్రీనివాస్ తెలిపారు. దరఖాస్తులు 3న సాయంత్రం 5 గంటల వరకు కాలేజీలో అందజేయాలని, సంబంధిత సబ్జెక్టు పీజీలో 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం మార్కులు, కనీస అర్హత పీహెచ్డీ, నెట్/సెట్ గల అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, ఇవిలేని పక్షాన కనీస అర్హత కలిగిన అభ్యర్థుల ప్రతిభ, అనుభవంఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.
బయోమెట్రిక్ , పనిగంటల ఆధారంగానే గౌరవ వేతనం ఇవ్వబడుతుందని, వారి పనితీరు నచ్చకపోయినా, క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించినా, వారి స్థానంలో రెగ్యులర్, కాంట్రాక్టు లెక్చరర్లు వచ్చినా ఎలాంటి సమాచారం లేకుండానే తొలగించబడతారన్నారు. ఈ నియామక ప్రక్రియ త్రిసభ్య కమిటీ ద్వారా జరుగుతుందని, మౌఖిక పరీక్ష 4న కాలేజీలో నిర్వహిస్తామని, ఆసక్తిగలవారు దరఖాస్తులు చేసుకోవాలని, ఇతర వివరాలకు 9963356835 నెంబర్ను సంప్రదించాలని కోరారు.