Yoga | ఆధునిక మానవుడు తన జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళనలను భాగం చేసుకుని వాటినుంచి బయటపడేందుకు నిత్యం సతమతమవుతున్నాడు. ఔషధాలతో కుస్తీ పట్టకుండా యోగాసనాలు సాధన చేస్తే.. ఒత్తిడి నుంచి కొంతవరకైనా బయటపడొచ్చు. తేలికైన ఈ మూడు ఆసనాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఒత్తిడి దూరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఉదయం ఓ పది నిమిషాల పాటు ఈ ఆసనాలు వేయడం అలవాటుగా చేసుకుంటే మంచిదని చెబుతున్నారు.
వెన్నెముక, నడుము, పాదాలు బలం పెంచుకోవడానికి బాలాసనం ఉపయోగపడుతుంది. ఈ ఆసనంలో మూడు నుంచి ఐదు నిమిషాల పాటు స్థిరంగా ఉండటం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. ముందుగా మోకాళ్లపై వజ్రాసనంలో కూర్చోవాలి. నడుమును పైకి ఎత్తకుండా శరీరాన్ని చిత్రంలో చూపించిన విధంగా ముందుకు వంచాలి. తలను నేలకు ఆనించి, చేతులను వెనక్కి చాపి పాదాలను అందుకోవాలి. ఈ భంగిమలో శ్వాసక్రియ నిదానంగా కొనసాగించాలి. ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.
చిత్రంలో చూపించిన విధంగా కాళ్లను, నడుమును పైకెత్తాలి. ఇలా సాధ్యం కాకపోతే.. ఒక గోడ సాయంతో కూడా ఈ ఆసనం వేయవచ్చు. ఈ ఆసనంలో మూడు నిమిషాలపాటు ఉండి క్రమపద్ధతిలో శ్వాస తీసుకుంటే.. రక్త ప్రసరణ మెరుగవుతుంది. నాడీవ్యవస్థ మీద ఒత్తిడి తగ్గుతుంది. మనసు రీఫ్రెష్ అవుతుంది.
కాళ్లను ముందుకు చాపి.. చిత్రంలో చూపించిన విధంగా.. వంగి చేతులతో పాదాలను అందుకోవాలి. ఈ ఆసనం వల్ల అంతర్గత ఆలోచనలకు కళ్లెం పడుతుంది. మనసు రిలీఫ్ అవుతుంది. వెన్నెముక, భుజాలు, మెడ నొప్పులు తగ్గుముఖం పడతాయి.