బచ్చన్నపేట సెప్టెంబర్ 1 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తమ్మడపల్లి, చిన్న రామంచర్ల, గోపాల్ నగర్, పడమటికేశాపూర్, లింగంపల్లి గ్రామాలలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబీకులను సన్మానించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ 225 సంవత్సరాలు పరిపాలించిన నైజాం పాలకులతో ఇబ్బంది పడ్డ ప్రజల విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందన్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946లో మొదలై 1951 వరకు కొనసాగిందని 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో నైజాం సంస్థానం విలీనం కావడం వాస్తవం అన్నారు. ఉద్యమంతో సంబంధం లేనటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి బూర్జువా భూస్వామ్య పార్టీలు ఈ పోరాటంపై నేటికీ వక్ర భాష్యాలు చేస్తూనే ఉన్నాయన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు పర్వతం నర్సింహులు, అన్నబోయిన రాజు, తాడెం రాములు, మన్నె లక్ష్మి, కల్పన, శాఖ కార్యదర్శి సుధాకర్, గుండా రవి, కొమ్ము శిరీష, రామగళ్ళ సుహాసిని, బోదాసు సుధాకర్, గజ్వేల్ రమేష్ , రాళ్ల బండి కనకాచారి, దండుగుల మురళీకృష్ణ, సీనియర్ నాయకులు రామగళ్ళ అశోక్ తదితరులు పాల్గొన్నారు.