చందంపేట, సెప్టెంబర్ 09 : భూముల సర్వేకు రైతులు సహకరించాలని చందంపేట తాసీల్దార్ శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మండలంలోని ఏపాలపయుతండాలో సర్వే నంబర్ 8లో 960 ఎకరాలకు రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో భూ సర్వే నిర్యహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికి భూ సర్వే చేపట్టినట్లు తెలిపారు. సర్వే సమయంలో రైతులు అందుబాటులో ఉండి పట్టా పాస్బుక్, ఆధార్, పాస్ ఫొటోలు అధికారులకు అందించాలన్నారు. ఇతర ప్రాంతంలో ఉన్న రైతులు సైతం భూ సర్వేలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హరీశ్ కుమార్, అనిల్, శివ, రఘు, భగత్, మాకట్లల్, లకపతి, హరి నాయక్, కళ్యాణ నాయక్, రవికుమార్ పాల్గొన్నారు.