కట్టంగూర్, సెప్టెంబర్ 09 : ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సివిల్, రాజీ పడదగిన క్రిమినల్, భూ వివాదాలు, మోటారు ప్రమాద పరిహారం, వైవాహిక, ఆస్తి విభజన, కార్మిక వివాదాలు, బ్యాంక్, చెక్ బౌన్స్ తదితర పెండింగ్ కోర్టు కేసులు లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చన్నారు. జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగిన కేసుల్లో సత్వర న్యాయం జరుగుతుందని, కక్షిదారులు అందరూ పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.