Black Color Tomatoes | టమాటాలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. వీటిని మనం రోజూ వివిధ రకాల కూరల్లో వేస్తుంటాం. చాలా వరకు కూరలు టమాటాలు లేకుండా పూర్తి కావు అంటే అతిశయోక్తి కాదు. అయితే టమాటాల పేరు చెప్పగానే మనకు వాటి చూడచక్కని ఎరుపు రంగు రూపం గుర్తుకు వస్తుంది. కానీ మీకు తెలుసా..? టమాటాల్లోనూ చాలా వెరైటీలు ఉన్నాయని. వాటిల్లో నలుపు రంగు టమాటాలు కూడా ఒకటి. ఇవి ముదురు ఊదా రంగులో ఉంటాయి. కానీ నలుపు రంగు టమాటాలుగానే పిలుస్తారు. ఈ టమాటాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎరుపు రంగు లాగే నలుపు రంగు టమాటాలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కానీ ఎరుపు రంగు టమాటాలతో పోలిస్తే నలుపు రంగు టమాటాలు భిన్న రకాల లాభాలను అందిస్తాయి. ఇక ఆ లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నలుపు రంగు టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు ఇదే రంగులో ఉంటాయి కనుక ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నలుపు రంగు టమాటాల్లోనూ ఉంటాయి. కనుకనే ఈ టమాటాలు ఈ రంగులో ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లను ఆంథో సయనిన్స్ అని పిలుస్తారు. వీటి వల్లే టమాటాలు నలుపు రంగులో ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. శరీరంలో వాపులను తగ్గిస్తాయి. ముఖ్యంగా గుండె కండరాలు, రక్త నాళాల వాపులు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
ఈ టమాటాల్లో క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణాలు కూడా ఉన్నాయని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. కనుక ఈ టమాటాలను తింటుంటే క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు. ఎరుపు రంగు టమాటాల్లాగే నలుపు రంగు టమాటాల్లోనూ లైకోపీన్ శాతం అధికంగానే ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతుంది. లైకోపీన్ వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో గుండె పోటు రాకుండా నివారించవచ్చు. లైకోపీన్ మన చర్మాన్ని సంరక్షిస్తుంది. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీంతో చర్మం సంరక్షించబడుతుంది. ఎండలో తిరగడం వల్ల చర్మం కందిపోకుండా, రంగు మారకుండా చూసుకోవచ్చు.
నలుపు రంగు టమాటాల్లో విటమిన్ సి కూడా అధికంగానే ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ కణాలకు మరమ్మత్తులు జరుగుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ టమాటాల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉండేలా చేస్తుంది. ఇలా నలుపు రంగు టమాటాలను అధికంగా తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. 100 గ్రాముల నలుపు రంగు టమాటాలను తింటే కేవలం 18 క్యాలరీలే లభిస్తాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారి అత్యుత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. ఈ టమాటాల్లో విటమిన్లు సి, కె, ఎలతోపాటు పొటాషియం, ఆంథోసయనిన్స్, లైకోపీన్ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి.