Telangana | హైకమాండ్ ఆర్డర్.. క్యాబినెట్ సరెండర్.. నేడు మంత్రులతో ఢిల్లీ పెద్దల సమీక్ష
Telangana | రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో, మంత్రుల మధ్య పంచాయితీ ఢిల్లీకి చేరింది. వివాదాలు, విభేదాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ కీలక నేతలతో ఢిల్లీలో గురువారం సమావేశం కానున్నారు.
Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో, మంత్రుల మధ్య పంచాయితీ ఢిల్లీకి చేరింది. వివాదాలు, విభేదాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ కీలక నేతలతో ఢిల్లీలో గురువారం సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఈ భేటీకి తప్పనిసరిగా హాజరుకావాలని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, సీఎం, మంత్రులను ఆదేశించింది.
బుధవారం ముంబైలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి రాత్రి ఢిల్లీకి చేరుకోగా, మంత్రులు సైతం ఢిల్లీ బాట పట్టారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన విందులో సీఎం పాల్గొన్నారు. గురువారం ఉదయం మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఈ సమ్మిట్‌కు హాజరుకానున్నారు. కాగా, ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల ప్రత్యేక సమావేశంపై పార్టీలో చర్చనీయాంశమైంది. ఏం జరుగుతుందో, ఎవరిపై ఎలాంటి చర్యలుంటాయోననే ఆందోళన వారిలో నెలకొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

