Scholarships | కుభీర్, సెప్టెంబర్ 09 : రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విద్యార్థి సంఘాలు నిరసన బాట పట్టాయి. AISB, TGVP ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో వివేకానంద, తపస్వి డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై భైటాయించి రాస్తా రోకో చేపట్టారు. ఆయా డిగ్రీ కాలేజీల నుండి స్థానిక బస్టాండ్ వరకు ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనగా కాలేజీలకు రియింబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇవ్వలేని ఈ పాలన ఇంకెన్నాళ్లని విద్యార్థులు జోరుగా నినాదాలు చేశారు.
అసమర్థ పాలకుల వల్లే రాష్ట్రంలో విద్యావ్యవస్థ బ్రష్టు పట్టిందని నినదించారు. గట్టిగా నినాదాలు చేస్తూ గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన యాజమాన్యాలు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వలన రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ &మైనార్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపురించిందన్నారు. రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో యాజమాన్యాలు కాలేజీలను నిర్వహణ భారం తడిసి మోపెడు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా 103 కళాశాలలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం మరో 69 కళాశాలలు మూతపడే దిశగా కొనసాగుతున్నాయని అన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు. రేవంత్ రెడ్డి సర్కారు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని.. దీనికి తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించారు. నిధులు విడుదల చేసి విద్యార్థుల, కళాశాల యాజమాన్యాల జీవితాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. త్వరలో నిధులు విడుదల చేయక పోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో AISB నాయకులు జవారే రాహుల్, TGVP కార్యదర్శి తులసి రామ్, కళాశాల ప్రిన్సిపాల్ లు Dr. సట్ల రవి, సంధ్యారాణి , అధ్యాపకులు దత్తత్రి , సాయన్న, రాములు, శ్రీనివాస్, లక్ష్మణ్, పోశెట్టి, మౌనిక, శ్రీకాంత్, దత్తు, విలాస్, రాజు, విజయ్, విద్యార్థులు ఉన్నారు.
Nepal | ఆగని ఆందోళనలు.. ఓలి రాజీనామాకు డిమాండ్.. మాజీ ప్రధాని ఇంటిని ధ్వంసం చేసిన నిరసనకారులు
BRS | రైతులకు సరిపడా యూరియా అందించండి.. కాల్వశ్రీరాంపూర్లో బీఆర్ఎస్ రాస్తారోకో
Aishwarya Rai | AIతో అశ్లీల కంటెంట్.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్య రాయ్