Jubilee Hills By Poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఓడిపోతామని తెలిసీ యూసుఫ్‌గూడ డివిజన్లో కాంగ్రెస్ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ విషయాన్ని గ్రహించిన బీఆర్ఎస్ నేతలు.. దొంగ ఓటర్లను పట్టుకున్నారు. భారీగా మహిళా ఓటర్లు పట్టుబడ్డారు. వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఎల్బీనగర్ మహిళా యూసుప్‌గూడలో ఓటు వేసిందని బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
ఎన్నికల అధికారులు, పోలీసులు దొంగ ఓట్లు వేసే వారికి సహకరిస్తున్నారు. ఓటరు జాబితాలో ఉన్న వ్యక్తులకు ఐడీ కార్డులో ఉన్న వ్యక్తులకు స్పష్టమైన తేడా ఉందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఎన్నికల అధికారులు, పోలీసులను నిలదీస్తున్న బీఆర్ఎస్ నేతలను అక్కడ్నుంచి బలవంతంగా పంపిస్తున్నారు పోలీసులు.
శ్రీనగర్ కాలనీలోని అమరావతి స్కూల్ వద్ద బూత్ 235–240లో భారీగా ఫేక్ ఓట్లు వేస్తూ దొరికిన మహిళలను బీఆర్ఎస్ నాయకులు పట్టుకున్నారు. కృష్ణానగర్‌లో ఫేక్ ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్లను పట్టుకున్నారు. మాకు దొంగ ఓట్ల గురించి అవసరం లేదు.. మీరు ఇక్కడి నుండి వెళ్ళిపొండి అంటూ బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల ప్రతాపం చూపించారు.
ఇక బోరబండ డివిషన్లో బస్టాప్ వద్ద ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, అచ్చంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ తిరిగారు. వారిని అడ్డుకోకుండా పోలీసులు భద్రత కల్పించారు.
యూసఫ్ గూడలో భారీగా ఫేక్ ఓట్లు వేస్తూ దొరికి పారిపోయిన మహిళలు
శ్రీనగర్ – అమరావతి స్కూల్ వద్ద బూత్ 235–240లో భారీగా ఫేక్ ఓట్లు వేస్తూ దొరికిన మహిళలను పట్టుకున్న బీఆర్ఎస్ఎస్ నాయకులు https://t.co/2iQIucXgvG pic.twitter.com/KuioS2fDSz
— Telugu Scribe (@TeluguScribe) November 11, 2025
కృష్ణానగర్‌లో ఫేక్ ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్లను పట్టుకున్న బీఆర్ఎస్ నాయకులు
మాకు దొంగ ఓట్ల గురించి అవసరం లేదు.. మీరు ఇక్కడి నుండి వెళ్ళిపొండి అంటూ బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల ప్రతాపం https://t.co/4BSUsH5vOH pic.twitter.com/vemL9zicFq
— Telugu Scribe (@TeluguScribe) November 11, 2025
బ్రేకింగ్ న్యూస్
యూసఫ్ గూడ – కృష్ణానగర్‌లో ఫేక్ ఓటు వేయడానికి వచ్చిన మహిళను పట్టుకున్న బీఆర్ఎస్ నాయకులు pic.twitter.com/f9lmo15Yh1
— Telugu Scribe (@TeluguScribe) November 11, 2025