Jubilee Hills By Poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్‌లపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, మాలోత్ రాందాస్‌తో పాటు ఎమ్మెల్సీ శంకర్ పోలింగ్ బూత్‌కు రావడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఓటర్లను ప్రభావితం చేసేలా తిరుగుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
స్థానికేతరులైన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు నియోజకవర్గంలో యధేచ్చగా తిరుగుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ అక్రమాలకు తెరతీశారు. రహమత్‌నగర్ డివిజన్ ఎస్డీపీ హోటల్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ తన అనుచరులతో హల్చల్ చేశారు. మరో పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ పెత్తనం చలాయించారు. వెంగళరావునగర్ పోలింగ్ బూత్ వద్ద సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి భర్త మట్టా దయానంద్ ఉన్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. రహమత్ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద కూర్చొని ఓటర్లతో మాట్లాడారు. దీంతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.